ఇజ్ఞత్ కా సవాల్ ! బీఆర్ఎస్ కు ఆ ఎన్నికల టెన్షన్ !

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలుమరింత దడ పుట్టిస్తున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో, కచ్చితంగా ఆ ప్రభావం కనిపిస్తుందని బిఆర్ఎస్ అంచనా వేస్తోంది.

 That Lok Sabha Election Tension For Brs Party , Brs Party, Kcr, Telangana Cm-TeluguStop.com

బిజెపి( BJP ) కూడా వీలైనంత ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఎన్నికల వ్యవహారాల పై దృష్టిపెట్టడం బీఆర్ఎస్ కు మరింత ఆందోళన పెంచుతున్నాయి.

దీంతో రాబోయే లోక్ సభ ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించింది.కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారినే ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిర్ణయించుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నడిచింది.కొన్ని స్థానాల్లో బిజెపి ప్రభావం కనిపించినా.

అసలు పోరు మాత్రం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్యనే జరిగింది.కానీ ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా వాతావరణం ఉండేలా కనిపిస్తోంది.

కాంగ్రెస్ తో పాటు, బిజెపి కూడా ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది.దీంతో బీజేపీని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు.టీఆర్ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చిన తరువాత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

దీంతో కాంగ్రెస్ బిజెపిల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.

Telugu Bowenpallyvinod, Brs, Brs Kcr, Kavitha, Mp, Telangana-Politics

అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాల్లో బీఆర్ఎస్( BRS Party ) గెలిచింది.తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో సాధించాయి.

బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మూడు పార్లమెంటు స్థానాలను బిజెపి గెలుచుకుంది.కాంగ్రెస్ నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి స్థానాల్లో విజయం సాధించింది.

దీంతో ఈ రెండు పార్టీల వ్యవహారాలను పరిశీలిస్తున్నారు .ఇప్పటికే పార్టీ అభ్యర్థుల.ఎంపికపై దృష్టి సారించారు.కరీంనగర్ లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు( Nama Nageswara Rao ) పేర్లు ఖరారు అయినట్టు సమాచారం.

Telugu Bowenpallyvinod, Brs, Brs Kcr, Kavitha, Mp, Telangana-Politics

నిజామాబాద్ నుంచి ఎంపీగా కవిత పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.అదిలాబాద్ లో గతంలో ఎంపీగా పనిచేసిన నగేష్ ప్రస్తుతం యాక్టివ్గా లేరు.వరంగల్ ప్రస్తుతం పసునూరి దయాకర్ కు మరోసారి అవకాశం కల్పించడం లేదు.అలాగే మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవితకు అవకాశం ఇస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ఇంకా అనేక ఎంపీ స్థానాల్లో మార్పు చేర్పులు చేపట్టే విషయం పైనే బీ ఆర్ ఎస్ అధినేత దృష్టిసారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube