లోక్‎సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ.. పీఏసీ భేటీలో తీర్మానం

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీఏసీ సమావేశంలో నేతలు చర్చించారు.

 Sonia's Contest From Telangana In Lok Sabha Elections.. Resolution In Pac Meetin-TeluguStop.com

ఇందులో భాగంగా వచ్చే వారం మరోసారి పీఏసీ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.అలాగే ఈ సమావేశంలో మొత్తం మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని నేతలు తీర్మానం చేశారు.గ్రామసభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని, దాంతో పాటు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని తీర్మానం చేశారు.

ఈనెల 28 నుంచి దాదాపు 15 రోజులపాటు గ్రామసభలు నిర్వహిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు.అలాగే తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని ఖర్గేకు లేఖ రాస్తామన్నారు.

నాగ్ పూర్ సభకు రాష్ట్రం నుంచి యాభై వేల మంది హాజరు కావాలని నిర్ణయించారు.అదేవిధంగా త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube