సలార్, డంకీలకు మనం ఎందుకు భయపడాలి.. కన్నడ హీరో సంచలన వ్యాఖ్యలు వైరల్!

డిసెంబర్ 21న షారుక్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా, అలాగే డిసెంబర్ 22న ప్రభాస్ నటించిన సలార్ సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఈ రెండు పాన్ ఇండియా సినిమాలపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.

 D-boss-darshan-comments-on-clash-with-salaar-and-dunki, Dunki Movie, Salaar Movi-TeluguStop.com

ఈ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ vs షారుఖ్ ఖాన్ వార్ లో చిన్న సినిమాలు చితికిపోతాయి అని విడుదలని వాయిదా వేసుకుంటున్నాయి.

ఈ ఎపిక్ క్లాష్ కి రంగం సిద్ధమవుతుంటే ఈ సినిమాల కన్నా వారం తర్వాత తన సినిమాని రిలీజ్ చేస్తున్న కన్నడ స్టార్ హీరో డీ బాస్ దర్శన్ మాత్రం క్లాష్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

కాటేరా సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న దర్శన్, ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.

ఆ సినిమాల గురించి మనం ఎందుకు భయపడాలి.ఇది మన గడ్డ, మనతో పోటీ పడాలంటే వాళ్లు భయపడాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

దర్శన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ మాటలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్, అంత ధైర్యం ఉంటే వారం తర్వాత ఎందుకు డిసెంబర్ 22నే కాటేరా రిలీజ్ చెయ్యాల్సింది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇదే విషయంపై అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రభాస్ అలాగే, షారుఖ్ ఖాన్ సినిమాలలో ఎవరి సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Telugu Darshan, Dunki, Salaar, Tollywood-Movie

అయితే ఈ సినిమా విడుదలకు కేవలం ఏడు రోజులు మాత్రమే ఈ సమయం ఉంది.ఇది ఇలా ఉంటే సలార్ సినిమా విషయానికి వస్తే.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube