విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లోని ఇండస్ ఆస్పత్రిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయింది.ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
ఆస్పత్రి ఫైర్ సెఫ్టీ నిబంధనలను పాటించడంతో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.ఆపరేషన్ థియేటర్ లో చెలరేగిన మంటలు ఆస్పత్రి అంతా వ్యాపించాయి.
దాంతో పాటు దట్టమైన పొగ అలుముకుంది.వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది, అధికారులు పేషెంట్లందరినీ సమీపంలోని కార్పొరేట్ ఆస్పత్రులకు, కేజీహెచ్ కు తరలించారు.
వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆస్పత్రిలో మొత్తం 47 మంది రోగులు ఉన్నారు.కాగా ఆపరేషన్ థియేటర్ లోని నైట్రస్ ఆక్సైడ్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు.