నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఒక్కసారిగా పేలుడు శబ్దాలు రావడంతో ఉలిక్కి పడ్డారు.
ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా దక్షిణం వైపు ఉన్న గుట్టను అధికారులు తొలగిస్తున్నారు.అయితే పిల్లర్ల కోసం గుట్టలోని బండరాళ్లను జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి పేల్చివేశారు.
దీంతో భారీ శబ్దాలు రావడంతో పాటు బండరాళ్లు ఎగిరి పడటంతో కొందరు భక్తులు గాయపడ్డారని తెలుస్తోంది.అలాగే ఓ భక్తుడికి చెందిన కారు అద్దం ధ్వంసం అయింది.
అయితే ఈ ఘటనపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.