ప్రపంచంలోనే అత్యంత పెద్ద షిప్ ఏదంటే.ముందుగా గుర్తుకు వచ్చేది టైటానిక్ ( Titanic )పేరే.
అయితే ఈ టైటానిక్ షిప్ కంటే ఐదు రెట్లు పెద్దగా ఉండే షిప్ సముద్రంలో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది.ఈ షిప్ ఎంతో ఆకర్షణీయకంగా, విలాసవంతమైన సౌకర్యాలతో నిర్మితమైంది.
ఆ షిప్ కు సంబంధించిన ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ పేరు ఐకాన్ ఆఫ్ ది సీస్( Icon of the Seas ).ఇది ఒక రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ లేటెస్ట్ మాస్టర్ పీస్.ఈ షిప్ 250800 టన్నుల బరువు కలిగి ఉంటుంది.
ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ గా చెప్పుకునే టైటానిక్ షిప్ బరువు 46329 టన్నులు.ఈ టైటానిక్ షిప్ కంటే ఐకాన్ ఆఫ్ ది సీస్ ఐదు రెట్లు పెద్దది.ఈ షిప్ 365 మీటర్లు అంటే 1200 అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.2024 జనవరి 27న సముద్రంలో ఈ షిప్ తన తొలి ప్రయాణం మొదలు పెట్టనుంది.

ఈ షిప్ లోపల ఉండే ప్రత్యేకతల విషయానికి వస్తే. 5000 మంది ప్రయాణికులకు కావలసిన వసతులన్నీ ఇందులో ఉంటాయి.ఈ షిప్ లో ఎపిక్ నియర్-వర్టికల్ డ్రాప్స్, ఫ్యామిలీ- ఓన్డ్ స్లైడ్, ఆరు రికార్డ్-బ్రేకింగ్ వాటర్ స్లైడ్లు ఏర్పాటు చేయనున్నారు.ఈ షిప్ 20 డెక్ లు గా విభజించబడి ఉంది.
ఈ షిప్ లో రెస్టారెంట్లు, ఆక్వా డోమ్, ఆక్వా పార్క్, స్నాక్ బార్ లు, వాటర్ ఫాల్ షోలు లాంటి అన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి.ఈ షిప్ లోపల మొత్తం ఒక వినోద స్వర్గంలా ఉండే వాతావరణం ఉంటుంది.
ఈ షిప్ మయామి నుంచి కరేబియన్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు ఏడు రాత్రులు ప్రయాణిస్తుంది.హాలిడే ట్రిప్ ఇష్టపడే వారు ఈ షిప్ లో ప్రయాణిస్తే ట్రిప్ జీవితాంతం గుర్తుండి పోయేంత ఆనందం పొందుతారు.
అసాధారణ ఫీచర్లతో ఉండే ఈ షిప్ అందరిని ఆకట్టుకుంటుందని రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, CEO మైఖేల్ బేలి చెప్పారు.