Rangamarthanda :రంగమార్తాండ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ కృష్ణ వంశీ( Krishna Vamsi ) దర్శకత్వంలో రూపొందిన సినిమా రంగమార్తాండ.ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు.

 Rangamarthanda Movie Review And Rating Details Here-TeluguStop.com

ఇక ఈ సినిమాకు కాలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

రాజ్ కె.నల్లి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.ఇక ఈ సినిమా మరాఠీ లో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ సినిమాకు రీమేక్ ఇది.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.అంతేకాకుండా పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచి బజ్ ఏర్పడింది.ఉగాది సందర్భంగా ఈరోజు ఈ సినిమా విడుదల కాగా ప్రేక్షకులను ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తేప్రకాష్ రాఘవరావు( Prakash Raj ) అనే పాత్రలో రంగస్థలం కళాకారుడుగా నటించాడు.ఇక ఆ కళాకారుడిగా ఈయనకు ఈయనకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి.దీంతో ఆయన అభిమానులు రంగమార్తాండ అనే బిరుదును ప్రధానం చేస్తారు.కానీ ఆ సమయంలో తను రిటైర్మెంట్ తీసుకుంటాను అని అందర్నీ నిరాశ పరుస్తాడు.ఇక తన ఆస్తులను పిల్లలకు పంచి ఇస్తాడు.

ఇక కొడుకు రంగారావు (ఆదర్శ్), కోడలు గీత (అనసూయ) లకు ఇంటిని, కూతురు శ్రీ (శివాత్మిక) కు పిక్స్ డిపాజిట్ చేసిన సొమ్మును ఇస్తాడు.అంతేకాకుండా ఆమె ప్రేమించిన వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్ తో పెళ్లి కూడా చేయిస్తాడు.

ఇక తన భార్య రమ్యకృష్ణతో సంతోషంగా గడపాలని అనుకుంటాడు.అయితే తను అనుకున్నట్లుగా తన జీవితం ఆనందంగా సాగుతుందో లేదో.

ఒక బ్రహ్మానందంకు తనకు ఉన్న సంబంధం ఏంటి.చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

Telugu Anasuya, Brahmanandam, Krishna Vamsi, Prakash Raj, Rahul Sipliganj, Ramya

నటినటుల నటన:

ఇక ప్రకాష్ రాజ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ పాత్రకైనా పూర్తి న్యాయం చేస్తాడు.ఇక ఈ సినిమాలో కూడా అదే విధంగా చేశాడు.బ్రహ్మానందం కూడా అద్భుతంగా నటించాడు.రమ్యకృష్ణ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్( Sivatmika ) అనసూయ తదితరులు పాత్రలకు తగ్గట్టుగా పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.దర్శకుడు ఈ సినిమాకు మంచి కథను అందించాడు.ఇళయరాజా( Ilaiyaraaja ) సంగీతం బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

Telugu Anasuya, Brahmanandam, Krishna Vamsi, Prakash Raj, Rahul Sipliganj, Ramya

విశ్లేషణ:

కథ ప్రారంభంలో నెమ్మదిగా సాగినట్లు అనిపించిన కూడా ఆ తర్వాత వచ్చే సీన్ లు ఎమోషన్స్ గా, ఆసక్తికరంగా చూపించాడు డైరెక్టర్.ఇంటర్వెల్ ముందు మాత్రం బాగా ఎమోషనల్ గా చూపించాడు.భార్యాభర్తల మధ్య సన్నివేశాలు కూడా అద్భుతంగా చూపించాడు.కొన్ని సన్నివేశాలతో కంటతడి పెట్టించాడు.

Telugu Anasuya, Brahmanandam, Krishna Vamsi, Prakash Raj, Rahul Sipliganj, Ramya

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ, నటీనటుల నటన, సంగీతం, ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు, ఎమోషన్స్, క్లైమాక్స్.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా మంచి ఎమోషనల్ తో కూడిన కుటుంబ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అందరికీ తెలిసిన కథ అయినప్పటికీ కూడా డైరెక్టర్ అంతకంటే గొప్ప కథగా తెరకెక్కించాడు ఈ సినిమాను.కాబట్టి ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube