రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బిగ్బాస్ హౌస్కి ఎంట్రీ ఇవ్వక ముందు వరకు కేవలం సోషల్ మీడియాని బాగా ఫాలో అయ్యేవరకు మాత్రమే పరిచయం ఉన్న పల్లవి ప్రశాంతి బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్టు ఫినాలి( Ticket To Finale ) రేస్ వరకు వచ్చాడు.
అయితే కొందరు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ కొడతాడు అని అంటుండగా ఇంకొందరు మాత్రం టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటాడు అని కామెంట్ చేస్తున్నారు.

కాగా డిసెంబర్ 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుందని తెలుస్తోంది.ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇతనేనంటూ పలువురి పేర్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి.ఇందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రైతు బిడ్డ( Rythu Bidda ) అలియాస్ పల్లవి ప్రశాంత్.
ఒక కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్ లో ఒకటిగా నిలిచాడు.తనదైన ఆటతీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకున్నాడు.
సినీ తారలు సైతం అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.దీంతో అందరు విన్నర్ రైతు బిడ్డ అని ఫిక్స్ అయ్యారు.
సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఇతని పేరు తెగ హల్ చల్ చేస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రైతుబిడ్డ ప్రశాంత్ కి సంబంధించి ఒక వార్త చెక్కలు కొడుతోంది.పవన్- హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ లో( Ustaad Bhagat Singh ) పల్లవి ప్రశాంత్ నటించనున్నాడని టాలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.డైరెక్టర్ హరీశ్ శంకర్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతారట.
ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ గేమ్ డైరెక్టర్‌కు బాగా నచ్చేసిందట.అందుకే పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఉస్తాద్ భగత్ సింగ్ లో తనకు ఒక పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.
ఫినాలే కు గెస్ట్ గా వచ్చి హరీష్ ఈ విషయాన్ని అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం.ఈ విషయం తెలిసి రైతు బిడ్డ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక టైటిల్ విన్నర్ ఎవరో చూడాలి మరి.