టాలీవుడ్ ఇండస్ట్రీలో మైత్రీ మూవీ మేకర్ నిర్మాతలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఈ బ్యానర్ కొంతకాలం క్రితం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ రంగంలో కూడా సక్సెస్ సాధించింది.
ప్రస్తుతం ఈ బ్యానర్ ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెడుతోంది.తమిలంలో వరుసగా సినిమాలను తెరకెక్కించే దిశగా మైత్రీ బ్యానర్ అడుగులు పడుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్( Ajith Kumar ) కు మైత్రీ నిర్మాతలు ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది.గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని మొదట వార్తలు వినిపించినా ఈ సినిమా కోసం తమిళ డైరెక్టర్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.
అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మార్క్ ఆంటోని సినిమాతో సక్సెస్ సాధించిన అధిక్ రవిచంద్రన్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.
అధిక్ రవిచంద్రన్( Adhik Ravichandran ) రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.అజిత్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రేంజ్ లో రెమ్యునరేషన్( Remuneration ) తీసుకుంటుండగా మైత్రీ సినిమాతో ఆయన రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.మైత్రీ నిర్మాతలు బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
మైత్రీ నిర్మాతలు రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.మైత్రీ బ్యానర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ బ్యానర్లలో ఒకటిగా నిలుస్తోంది.మైత్రీ నిర్మాతలు రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.
ఈ నిర్మాతలు తమిళ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటాలని నెటిజన్లు భావిస్తున్నారు.