మైత్రీ బ్యానర్ లో అజిత్ మూవీకి రెమ్యునరేషన్ అన్ని రూ.కోట్లా.. రికార్డ్ పారితోషికం అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మైత్రీ మూవీ మేకర్ నిర్మాతలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఈ బ్యానర్ కొంతకాలం క్రితం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ రంగంలో కూడా సక్సెస్ సాధించింది.

ప్రస్తుతం ఈ బ్యానర్ ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెడుతోంది.తమిలంలో వరుసగా సినిమాలను తెరకెక్కించే దిశగా మైత్రీ బ్యానర్ అడుగులు పడుతున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్( Ajith Kumar ) కు మైత్రీ నిర్మాతలు ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని మొదట వార్తలు వినిపించినా ఈ సినిమా కోసం తమిళ డైరెక్టర్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మార్క్ ఆంటోని సినిమాతో సక్సెస్ సాధించిన అధిక్ రవిచంద్రన్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

"""/" / అధిక్ రవిచంద్రన్( Adhik Ravichandran ) రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

అజిత్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రేంజ్ లో రెమ్యునరేషన్( Remuneration ) తీసుకుంటుండగా మైత్రీ సినిమాతో ఆయన రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

మైత్రీ నిర్మాతలు బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. """/" / మైత్రీ నిర్మాతలు రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.

మైత్రీ బ్యానర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ బ్యానర్లలో ఒకటిగా నిలుస్తోంది.మైత్రీ నిర్మాతలు రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.

ఈ నిర్మాతలు తమిళ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటాలని నెటిజన్లు భావిస్తున్నారు.

రీల్ కోసం రైలు కింద పడుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. తర్వాతేం జరిగిందో చూస్తే షాక్!