బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ మేరకు సాధన స్కూల్ పోలింగ్ సెంటర్ లో ఆయన కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని బండి సంజయ్ సూచించారు.ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని తెలిపారు.
ప్రజాస్వామ్యయుతంగా గెలవాలన్న ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ దిగజారిన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.నాగార్జునసాగర్ వివాదం ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
కేసీఆర్ వి ఫాల్స్ రాజకీయాలన్న బండి సంజయ్ దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని వెల్లడించారు.