ఉండవల్లి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ ఉండవల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Hearing On Undavalli's Petition Adjourned In Ap High Court-TeluguStop.com

ఈ క్రమంలోనే కేసులో కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తెలిపారు.అయితే 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని రిజిస్ట్రార్ కోర్టుకు వెల్లడించారు.

మిగతా వారి అడ్రస్ లు తప్పుగా ఉండటంతో నోటీసులు చేరలేదని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలని పిటిషనర్ కోర్టును కోరగా.

మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube