పెద్దపల్లిలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అడుగుతోందన్న ఆయన కాంగ్రెస్ కొత్తపార్టీ కాదు చెత్తపార్టీ అని విమర్శించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీకి పదకొండు అవకాశాలు ఇచ్చినా చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.రైతులను కాంగ్రెస్ ఆగం చేసిందన్నారు.
వందల మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.ఇది వ్యక్తుల మధ్య కాదు.
పార్టీల మధ్య పోటీ అని పేర్కొన్నారు.అసలు తెలంగాణలో రైతుబంధు పెట్టింది ఎవరని ప్రశ్నించారు.
ఇంటింటికి నీళ్లు ఇస్తుంది, 24 గంటల కరెంట్ ఇస్తుంది ఎవరని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలో ఆలోచించుకోవాలన్నారు.కాంగ్రెస్ కు ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్న కేటీఆర్ తెలంగాణను పట్టించుకునే నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని వెల్లడించారు.