సినిమా అంటే రంగుల ప్రపంచం.ఆ రంగుల ప్రపంచంలో ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చి నటించి ప్రేక్షకుల మనసులలో జరగని ముద్రను వేసుకుంటూ ఉంటారు.
భాషతో సంబంధం లేకుండా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు ఏర్పరచుకుంటూ ఉంటారు.అయితే టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు రాణిస్తున్న విషయం తెలిసిందే.
అయితే వారు ఎక్కడ పుట్టారు వారి జన్మస్థానాలు ఏంటి అన్నది చాలా మందికి తెలియదు.మరి టాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీల జన్మస్థానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) మొగల్తూరులో జన్మించారు.టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ( Raviteja ) ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు.
ఫ్యామిలీ హీరో శ్రీకాంత్( Srikanth ) జన్మించింది కర్ణాటకలోని గంగావతి అనే ఒక ఊరిలో.కానీ ఆ తర్వాత ఆయన కృష్ణా జిల్లాకు వచ్చి సెటిల్ అయ్యారు.యాంకర్ సుమ కనకాల( Suma Kanakala ) జన్మస్థానం కేరళలోని పాలక్కాడ్ లో.ఎక్కడో కేరళలో పుట్టి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ ఎంతో మందిని అలరిస్తోంది.టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హైదరాబాదులోనే 1983లో జన్మించారు.ఎన్టీఆర్ తల్లి కర్ణాటకలో జన్మించారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జన్మస్థానం బాపట్ల. తండ్రి పోలీస్ అధికారి కావడంతో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యేవారు.అలాగే హీరో విక్టరీ వెంకటేష్ జన్మస్థానం కారం చేడు.
ఆ తర్వాత రామానాయుడు ఫ్యామిలీ చెన్నైకి షిఫ్ట్ అయ్యి ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నారు.టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజు( Prakash Raj ) పుట్టింది బెంగళూరులో.ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంత్రి రోజా జన్మస్థానం తిరుపతి.
దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి తమిళనాడులోని మీనాంపట్టి గ్రామంలో జన్మించారు.అయితే ఆమె బాల్యమంతా కూడా తిరుపతిలోనే గడిచిందట.
ఒకప్పటి టాప్ హీరో సుమన్ జన్మస్థానం కర్ణాటకలోని మంగళూరు.పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ జన్మస్థానం ఈస్ట్ గోదావరి జిల్లాలోని మట్టపర్రు అనే గ్రామం.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సత్తెనపల్లి దగ్గరలోని చాగంటి వారి పాలెం లో జన్మించారు.