ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్ లు..!!

అక్టోబర్ 7వ తారీకు నుంచి ఇజ్రాయెల్( Israel ) సైనికులకు.హమాస్ మిలిటెంట్ ల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

 Hamas Militants Released Israeli Hostages Israel, Hamas, Israel War , Palestine-TeluguStop.com

హమాస్ మిలిటెంట్ లు మొదలుపెట్టిన ఈ యుద్ధంలో ఇరువైపులా చాలామంది అమాయకులు బలైపోయారు.ఈ క్రమంలో హమాస్ ఇజ్రాయెల్ పౌరులను కొంతమందిని అపహరించి బందీలుగా తీసుకుపోవడం తెలిసిందే.

ఈ బందీలను విడిపించడానికి ఇజ్రాయెల్ సైనిక బలగాలు గాజా( Gaza )పై విరుచుకు పడుతున్నాయి.దాదాపు నెల రోజుల నుండి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ భారీ బాంబులతో గాజా పై విరుచుకుపడుతున్నాయి.

దీంతో హమాస్ మిలిటెంట్ లు కాల్పుల ఒప్పందానికి.అరబ్ దేశాల చేత ఇజ్రాయెల్ నీ ఒప్పించి తమ దగ్గర ఉన్న బందీలను 13 మందిని విడుదల చేస్తామని నాలుగు రోజులపాటు కాల్పులు విరమించాలని ఒప్పందం చేసుకున్నారు.

ఒప్పందం ప్రకారం శుక్రవారం సాయంత్రం 13 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ విడుదల చేయడం జరిగింది.గాజా లోని దక్షిణ ప్రాంతం నుంచి 13 మంది మహిళలు, పిల్లలను రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించింది.

దీంతో వాళ్ళు రాఫా బోర్డర్ నుంచి ఈజిప్టుకు బయలుదేరారు.అక్కడ నుంచి వారిని ఇజ్రాయెల్ ఆర్మీ చేరదీయనుంది.ఇక ఇదే సమయంలో ఇజ్రాయెల్ జైలో ఉన్న 39 మంది పాలస్తీనా( Palestine ) పౌరులను విడుదల చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube