నవంబర్ 19 ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్న రోజు.ఈరోజే వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్( ODI Cricket World Cup 2023 Final Match ) జరగనుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో( Narendra Modi Stadium in Ahmedabad ) ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ ట్రోఫీ కోసం హోరా హోరీగా తలపడనున్నాయి.ఈసారి ఇండియా సింగిల్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
విరాట్ కోహ్లీ విధ్వంసకరం బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు.ఇండియా గెలవాలని చాలామంది ఈసారి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.
అంతేకాదు, పలువురు 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పటి సెంటిమెంట్లను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.ఆ సెంటిమెంట్స్ ప్రస్తావిస్తూ ఈసారి కూడా ఇండియా కచ్చితంగా వరల్డ్ కప్ నెగ్గుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్ గెలవడం ఇండియన్స్ కి చాలా అవసరం.సగర్వంగా ఇండియా గెలిచిందని కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు.ప్రత్యక్షంగా ఆ విజయాన్ని చూస్తే వచ్చే మజానే వేరు.అందుకే చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు తరలి వస్తుంటారు.
ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi )కూడా రానున్నారు.
అయితే 2011లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు మహేష్ బాబు( Mahesh Babu ) వచ్చాడు.అయితే అతడు వచ్చిన వేళా విశేషం వల్ల మన ఇండియా ప్రపంచ కప్ గెలిచిందని, అతను ఈసారి కూడా వస్తే కప్పు మనదేనని ఒక వింత సెంటిమెంటును బలంగా స్ప్రెడ్ చేస్తున్నారు.2011లో మహేష్ బాబు క్రికెట్ స్టేడియంలో కూర్చొని వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్న ఫోటోను కూడా వైరల్ చేస్తున్నారు.ఈసారి మహేష్ బాబు తప్పకుండా మ్యాచ్ చూసేందుకు వస్తాడని, వస్తే కప్పును రోహిత్ సేన( Rohit Sena ) ముద్దు పెట్టుకోవడం ఖాయం అని అంటున్నారు.
మరి ఈ గుంటూరు కారం హీరో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్తాడా లేదంటే ఇంట్లో ఫ్యామిలీతో కలిసి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తాడా? అనేది ప్రస్తుతానికి అయితే తెలియదు.ఇక ఇలాంటి సెంటిమెంట్ ని అభిమానులను పక్కన పెడితే, రేపు జరగబోయే మ్యాచ్‌లో ఇండియాకు 150 కోట్ల భారతీయుల మద్దతు కచ్చితంగా ఉంటుంది.వారు ఎన్నో ప్రార్థనలు కూడా చేస్తున్నారు.
ఈసారి మన టీమ్ చాలా బలంగా కూడా ఉంది.ఆస్ట్రేలియా ని ఈజీగా ఓడిస్తుందని విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తున్నారు.
అయితే ఆస్ట్రేలియా టీమ్‌ను తక్కువ అంచనా వేయకూడదు.మొత్తం మీద సెంటిమెంట్లను పక్కనపెట్టి భారత్ ట్రోఫీ వినయ్ చరిత్ర సృష్టించాలని మనసారా ఆశిద్దాం.
ధోనీ తర్వాత మళ్లీ రోహిత్ కోహ్లీ కలిసి ఇండియాకు కప్పును తీసుకొస్తారని, భవిష్యత్తులో క్రికెట్ ఆటగాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని భావిద్దాం.ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఫైనల్ పోరు సందర్భంగా ఎయిర్ ఈవెంట్స్ నిర్వహించనుంది.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ సైతం ఫైనల్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తాడని అంటున్నారు.