తక్కువ బడ్జెట్ లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి ఉండే కార్లు ఏమిటో మీకు తెలుసా..?

ప్రస్తుతం రోడ్లపై ప్రమాదాలు ఎంతలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.అయితే ప్రమాదాలు జరిగినా కూడా సురక్షితంగా బయట పడాలంటే కార్లలో ఎయిర్ బ్యాగులు( Air bags in cars ) ఉండడం తప్పనిసరి.

 Do You Know The Low Budget Cars That Have Six Airbags , Air Bags In Cars, Low Bu-TeluguStop.com

పైగా ఎయిర్ బ్యాగుల కారణంగా మరణాలు రేటు తగ్గుముఖం పట్టాయని గణాంకాలు చెబుతున్నాయి.భారత కేంద్ర ప్రభుత్వం కూడా భారత మార్కెట్లో విక్రయించబడే కార్లలో కనీసం ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా అమర్చాలని కార్ల తయారీ సంస్థలకు స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రముఖ కార్ల కంపెనీలు లగ్జరీ కార్లలో 6 లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్ బ్యాగులను అమర్చి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.భారత మార్కెట్లో ఆరు ఎయిర్ బ్యాగులను అమర్చి తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉండే కార్లు ఏమో చూద్దాం.

Telugu Hyundai Aura, Hyundai, Line, Nexon Ev, Tata Nexon-Technology Telugu

టాటా నెక్సాన్, నెక్సాన్ ఈవీ:( Tata Nexon, Nexon EV )

ఈ కారు ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి, అధునాతన ఫీచర్లతో ఉంటుంది.భారత మార్కెట్లో ఈ కార్ల ఎక్స్ షోరూం ధర రూ.8.10 లక్షల నుండి రూ.15.50 లక్షల వరకు ఉంటుంది.అదే నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ధర విషయానికి వస్తే.ఎక్స్ షోరూం ధర రూ.14.74 లక్షల నుండి రూ.19.94 లక్షల వరకు ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ N లైన్:( Hyundai Venue, Venue N Line )

Telugu Hyundai Aura, Hyundai, Line, Nexon Ev, Tata Nexon-Technology Telugu

ఈ కారు ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి, అధునాతన ఫీచర్లతో ఉంటుంది.భారత మార్కెట్లో వెన్యూ ధర రూ.7.89 లక్షల నుండి రూ.13.48 లక్షల ( ఎక్స్ షోరూం) వరకు ఉంటుంది.వెన్యూ ఎన్లైన్ ధర రూ.12.08 లక్షల నుండి రూ.13.90 లక్షల (ఎక్స్ షోరూం) వరకు ఉంటుంది.

హ్యుందాయ్ ఆరా:( Hyundai Aura ) ఈ మోడల్ అన్ని వేరియంట్లు ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉన్నాయి.ఈ కారు ధర రూ.6.44 నుంచి రూ.9 లక్షల (ఎక్స్ షోరూం) గా ఉంది.

Telugu Hyundai Aura, Hyundai, Line, Nexon Ev, Tata Nexon-Technology Telugu

హ్యుందాయ్ i20, i20 N లైన్:( Hyundai i20, i20 N Line )

ఈ కార్లు ఆరు ఎయిర్ బ్యాగులతో ఉంటాయి.i20 కారు ధర రూ.6.99 లక్షల నుంచి రూ.11.16 లక్షల (ఎక్స్ షోరూం) వరకు ఉంటుంది.i20 N లైన్ కారు ధర రూ.9.99 లక్షల నుండి రూ.12.47 లక్షల (ఎక్స్ షోరూం) వరకు ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube