వెలుగుల పండుగ దీపావళిని భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.విదేశాల్లో స్థిరపడిన భారతీయులు( Indians ) అక్కడి తమ బంధు మిత్రులతో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
పలువురు దేశాధినేతలు , సెలబ్రేటీలు భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తాజాగా బ్రిటన్ ప్రధాని భారత సంతతికి చెందిన రిషి సునాక్ ( Rishi Sunak )కూడా ఈ లిస్టులో చేరారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న హిందువులకు, బండి చోర్ దివస్ జరుపుకుంటున్న సిక్కులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘ దీపాల వెలుగులతో , భవిష్యత్తును ఆశతో చూడగలిగే తరుణం ఇది.చీకటిపై వెలుగు సాధించిన విజయానికి చిహ్నంగా, ప్రకాశవంతమైన రేపటి కోసం చేసే ప్రయత్నానికి దీపావళి ఒక పదునైన ప్రాతినిథ్యమని నేను నేమ్ముతున్నాను.బ్రిటన్‌కు( Britain ) తొలి ఆసియా ప్రధానిగా, భక్తుడైన హిందువుగా , యూకేలో దీపావళి పండుగ జాతి, సాంస్కృతిక వైవిధ్యానికి సంబంధించిన వేడుకగా వుండాలని ఆశిస్తున్నాను’’ అంటూ ప్రధాని రిషి సునాక్ ఓ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు.దీపావళి పర్వదినం( Diwali day ) నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌ను రంగు రంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు.గత బుధవారం ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిలు( Akshata Murthy ) ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బ్రిటన్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
అంతేకాదు.ఈ దీపావళికి మరో ప్రత్యేకత కూడా వుంది.
బ్రిటన్ ప్రధానిగా రిషి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది.ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇకపోతే.భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) కూడా ఈ మంగళవారం వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులతో పాటు నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.