రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, బి ఆర్ ఎస్ మండల బీసీ సెల్ నాయకులు చిర్రం నాగరాజు యాదవ్, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతుబంధు సమితి ( ( Rythumandhu Samiti )మండల సభ్యుడు మద్దుల శ్రీపాల్ రెడ్డి, బొప్పాపూర్ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు యాదవ సంఘం జిల్లా నాయకులు లంబ సత్యం యాదవ్,హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన చేగంటి అనిల్ యాదవ్ లు కామారెడ్డిలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ స్వగృహంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కేకే మహేందర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేస్తామని అన్నారు.