రాజన్న సిరిసిల్ల జిల్లా : కమ్యూనిటి పోలీసింగ్ లో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి , జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐఎం ఎ సిరిసిల్ల, అశ్వినీ హాస్పిటల్ వారి సహకారంతో వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా హజారై ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి సత్వరమే వైద్యం సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిపుణులు అయిన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కంటి, దంత, గైనకాలజిస్ట్, న్యూరో, జనరల్ ఫిజీషియన్ , జనరల్ సర్జన్ ,అర్ధోపెడిక్, పిల్లల వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్సలు అందించడాం జరిగిందని,ఆరోగ్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.
వైద్య శిబిరానికి హాజరైన చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ భోజన, రవాణా వసతులు కల్పించడం జరిగిందన్నారు.ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నది ప్రజా భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోరకు కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అందులో భాగంగా గతంలో వీర్నపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగిందన్నారు.
గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డాయని తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలన్నారు.యువత చెడు మార్గాల వైపు మరలకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని , గంజాయి అలవాటు పడిన వారి వివరాలు అందించాలని వారికి నిపుణులు అయిన వైద్య నిపుణుల చేత కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి సహకరించి బారి ఎత్తున పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేపించుకున్న ప్రజలను అభినందించిన జిల్లా ఎస్పీ.ఉచిత మెగా వైద్య శిబిరానికి పిలువగానే సిరిసిల్ల , ఎల్లారెడ్డిపేట్ నుండి వచ్చిన వైద్య బృందానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్.ఐ రమేష్ ,డాక్టర్లు సత్యనారాయణ, అభినయ్, సునీల్ కుమార్ ఆర్థోపెడిక్, రవి కిరణ్ జరల్ సర్జన్, అవని గైనకలజిస్ట్, అమిత జనరల్ ఫిజిసియన్ , ఓబులేసు పిల్లల వైద్య నిపుణులు, గోపి కృష్ణ దంత వైద్య నిపుణులు, అజిత్ కుమార్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, కార్తిక్ కంటి వైద్య నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు.