కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఏడీఏ వెంకటేశ్వరరావు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎరువులు, విత్తనాల్లో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏడీఏ వెంకటేశ్వరరావు దుకాణదారులను హెచ్చరించారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, కొలనుపాకలో విత్తన, ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి,విత్తనాల స్టాక్ రిజిష్టర్లను,విత్తన ప్యాకెట్లపై గల వివరాలను పరిశీలించారు.

 Strict Action Will Be Taken If Artificial Scarcity Is Created Ada Venkateswara R-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ విత్తనాల,ఎరువుల దుకాణాలలో ప్రతీ రోజు తప్పకుండా స్టాక్ బోర్డులను రాయాలని సూచించారు.

వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రోజూ విత్తనాల నిల్వలను తనిఖీ చేసి,స్టాక్ బోర్డులను రాసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

స్టాక్ బోర్డులో స్టాక్ ఉండి రైతులకు విత్తనాలు ఇవ్వని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉన్నాయని,రైతులు విత్తనాలు,కొనుగోలు చేశాక బిల్లు రశీదు తప్పకుండా తీసుకోవాలని,విత్తనాల ప్యాకెట్లను మరియు బిల్లు రశీదులను పంటకాలం పూర్తయ్యేవరకూ జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నారు.

ఈ తనిఖీలలో ఏఈఓలు రాకేష్,వేణు,శివకుమార్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube