హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యతో బాగా విసిగిపోయారా.? ఎన్ని ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగడం లేదా.? రోజు రోజుకు మీ కురులు పల్చగా మారుతున్నాయా.? అయితే మీకు వాము ఆకే బెస్ట్ ఆప్షన్.ఈ ఆకును తలకి రాస్తే హెయిర్ సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.పైగా వాము ఆకు వల్ల మరెన్నో బెనిఫిట్స్ లభిస్తాయి.మరి ఇంతకీ వాము ఆకును తలకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా నాలుగు వాము ఆకులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న వాము ఆకు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె( Mustard oil ), వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వాము ఆకులో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.
ఆరోగ్యానికే కాకుండా వాము ఆకు( Ajwain Leaves ) జుట్టు సంరక్షణకు కూడా సహాయపడుతుంది.ఈ ఆకును పైన చెప్పిన విధంగా తలకు పట్టిస్తే చాలా వేగంగా హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.
అదే సమయంలో జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.అలాగే వాము ఆకును జుట్టుకు రాయడం వల్ల త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటుంది.కాబట్టి హెల్తీ, స్ట్రాంగ్ అండ్ థిక్ హెయిర్ ను కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.