తల్లిని తరచూ వేధించే తండ్రిని బండరాయితో కొట్టి చంపిన కొడుకు..!

తన తల్లిని తరచూ తండ్రి వేధించడం చూస్తూ భరించలేకపోయినా యువకుడు ఓ బండరాయి మోది తండ్రిని హత్య చేసిన ఘటన కర్ణాటకలోని రాయచూర్ లో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

 The Son Killed The Father Who Often Molested His Mother With A Stone , Raichur I-TeluguStop.com

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.రాయచూరు జిల్లాలోని దేవర భూపర గ్రామంలో బండి తిమ్మన్న( Bandi Timmanna ) (55) కుటుంబం నివాసం ఉంటోంది.

ఇతనికి భార్య కుమారుడు ఉన్నారు.కుమారుడు శీలవంత( Silwanta ) కు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు సంతానం.

శీలవంత వద్దనే బండి తిమ్మన్న, ఇతని భార్య కలిసి ఉంటున్నారు.బండి తిమ్మన్న ప్రతిరోజు తన భార్యను చిత్రహింసలు పెట్టేవాడు.

శీలవంత ఎన్నిసార్లు నచ్చజెప్పిన తండ్రి బండి తిమ్మన్న ప్రవర్తనలో మార్పు రాకపోగా ఇంకా ఎక్కువగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు.

Telugu Bandi Timmanna, Latest Telugu, Silwanta-Latest News - Telugu

తాజాగా ఆదివారం రోజు బండి తిమ్మన్న తన భార్యను వేధించడంతో శీలవంత తండ్రితో వాగ్వాదానికి దిగాడు.ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో శీలవంత తన కుమారుడిని గదిలోకి పంపించి ఆ తర్వాత ఓ పెద్ద బండరాయిని తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు.కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది.

బండి తిమ్మన్న చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఊరి బయట పారేయాలని ప్రయత్నించి, ఆ తర్వాత మనసు మార్చుకొని శీలవంత పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత శీలవంత తాను చేసిన నేరం గురించి పోలీసులకు వివరించాడు.

పోలీసులు మృతుడి భార్యను విచారించగా తన భర్త తరచూ చిత్రహింసలకు గురి చేసేవాడని, తల్లి వేధింపులను చూడలేకపోయినా తన కొడుకు ఆవేశంలో ఇలా చేశాడని పోలీసులకు తెలిపింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని శీలవంతను అరెస్టు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

కొడుకు తండ్రిని హత్య చేయడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube