భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( Cricket World Cup ) టోర్నీలో ఆరంభం నుంచి ఇప్పటివరకు భారత జట్టు( Team India ) టైటిల్ ఫేవరెట్ గా నిలిచింది.ఓటమి అనేదే ఎరుగకుండా ఆడిన ప్రతి మ్యాచ్లో వరుస విజయాలను సాధిస్తూ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.ఈ టోర్నీ లో ఉండే మిగతా జట్లకు ఊహించని షాక్ ఇచ్చింది.2023 సంవత్సరం భారత జట్టుకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు వన్డే ఫార్మాట్లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లను భారత్ గెలుచుకుంది.అదే ఫామ్ ను వన్డే వరల్డ్ కప్ లో కూడా కంటిన్యూ చేస్తోంది.
ఇక వన్డే వరల్డ్ కప్ 2023 టైటిల్ భారత జట్టుదే.

భారత జట్టు వరుస విజయాలను సాధించడం పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జీర్ణించుకోలేక పోతూ విచారణకు డిమాండ్ చేశారు.భారత జట్టు బౌలర్లు ప్రతి ప్రత్యర్థి జట్టు లైనప్ ను పడగొట్టడం వెనుక ఏదైనా కుట్ర ఉందేమో అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హాసన్ రజా ( Hasan Raza ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.భారత జట్టు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో ఇతర దేశాల బౌలర్ల కంటే భారత జట్టు బౌలర్లకు( India Bowlers ) వికెట్ పై స్వింగ్ ఎక్కువగా లభిస్తోందని, భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ ఇందులో ఏమైనా బీసీసీఐ మరియు ఐసీసీ కలిసి కుట్ర చేసి ఉండొచ్చు.
భారత జట్టు బౌలర్లకు ప్రత్యేక బంతులు అందించడం వల్ల వాళ్లు ఎలాంటి వికెట్ అయినా సులభంగా తీస్తున్నారు.అంతేకాకుండా డీఆర్ఎస్ టీం( DRS ) కూడా భారత జట్టుకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పాడు.

పాకిస్తాన్( Pakistan ) మాజీ ప్లేయర్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.ఈ వ్యాఖ్యలను భారత క్రికెట్ అభిమానులు ఖండిస్తూ, అలాంటి ప్రత్యేక బంతులు ఎక్కడైనా ఉంటాయా.? అంపైర్లకు ఆ మాత్రం అవగాహన ఉండదా.? ఒకవేళ పాకిస్తాన్ లో జరిగే టోర్నీలలో ఇలాంటివి ఉంటాయో కానీ భారత్ లో ఇలాంటివి మాత్రం ఉండవని ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు.భారత జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో విజయం సాధించడం వల్లే పాకిస్తాన్ మాజీ ప్లేయర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.