టాలీవుడ్ మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ ( Varun Tej )హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi )ల పెళ్లి తాజాగా నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ పెళ్లి ఫోటోలను చూసిన మెగా అభిమానులు నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించడంతో పాటు ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.చూడముచ్చటైన జంట,సూపర్ జోడి, సూపర్ కపుల్,క్యూట్ కపుల్ అంటూ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.
ఈ జంట ఎప్పుడెప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటి అవుతారా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
అనుకున్నట్టుగానే తాజాగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు ఈ సెలబ్రిటీ జంట.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే.2017లో విడుదల అయిన మిస్టర్ సినిమా( Mr.Cinema ) సమయంలో ప్రేమలో పడిన ఈ జంట దాదాపుగా ఆరేళ్లపాటు సీక్రెట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.వారి ప్రేమ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
సడెన్‌గా ఇటీవల జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు.ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో వీరిద్దరికి సంబంధించిన వార్తలు ఎన్నో వచ్చాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ విషయం గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.కాగా లావణ్య, వరుణ్ మధ్య కేవలం 11 నెలల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది.వరుణ్ తేజ్ జనవరి 19 1990లో జన్మించాడు.లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15, 1990లో పుట్టింది.అయితే దీన్ని బట్టి చూసుకుంటే వీరి మధ్య కేవలం 11 నెలల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు అర్థమవుతోంది.ఇద్దరూ కూడా ఒకే సంవత్సరంలోనే జన్మించారు.
దీంతో ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.చాలావరకు సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఏజ్ గ్యాప్ విషయంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.