సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు విభిన్నమైన పాత్రలు పోషిస్తుంటారు.వీరిలో కొందరు తమ వయసు కంటే తక్కువ వయసులో నటిస్తే, మరికొందరు ముసలి హీరోలతో రొమాన్స్ చేయడానికి కూడా రెడీ అయిపోతారు.
గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడరు.ఓన్లీ రొమాన్స్ పై ఆధారపడిన సినిమాల్లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు.
బెడ్ రూమ్ సీన్స్ చేయడానికి కూడా ఓకే చెప్తుంటారు.అయితే, మిగతా కథానాయికలకు అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) చాలా విభిన్నంగా ఉంటుంది.
అందుకే ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చిన హీరోయిన్ గా నిలుస్తుంది.ఆమె మాతృభాష తెలుగు కాదు, ఆమె మలయాళీ.
అయినా తన అందచందాలు, ప్రతిభతో తెలుగు ప్రజల మనసు దోచుకుంది.దానికి ఒక కారణం ఉంది.
తెలుగు అమ్మాయిని తలపించే సహజ సౌందర్యం అనుపమది.చీర, చుడిదార్, పూలు, గాజులు ధరించి సంప్రదాయ తెలుగు అమ్మాయిలా ఆమె తనను తాను సులభంగా మార్చుకోవచ్చు.ఎలాంటి వేషధారణలోనైనా ఆమె అద్భుతంగా కనిపిస్తుంది.అయితే మేకప్ అందం, గ్లామర్‌పై ఆధారపడే తన తరం హీరోయిన్ల ట్రెండ్స్‌ని ఆమె అనుసరించడం లేదు.తనకు ఎలాంటి అందం సూట్ అవుతుందో, ఎలాంటి పాత్రలు చేయాలో ఆమెకు తెలుసు.సిగ్గు విడిచి మరీ ఆమె అందాలు ఆరబోయదు.
ఆమె స్టైల్, గ్రేస్‌తో కూడిన రోల్స్ చేయడానికి ఒప్పుకుంటుంది.అ ఆ, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే( Shatamanam Bhavati, Hello Gurupremakosama ), రాక్షసుడు, కార్తికేయ 2, 18 పేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ముద్దుగుమ్మ అన్నిటిలోనూ చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించింది.
వాటిలో ఏ ఒక్కటిలోనూ హద్దులు మించి రొమాన్స్ చేయలేదు.
నిజానికి దర్శకులు( Directors ) చెప్పినట్లు ఆమె గుడ్డిగా అనుసరించదు.ఎక్స్పోజింగ్ చేసి సినిమా అవకాశాలు దక్కించుకోవాలని ఎప్పుడూ పాకులాడదు.క్రేజ్ కోసం ఆమె తన గౌరవం, విలువల విషయంలో రాజీపడదు.
ఆమె తన చర్యల పర్యవసానాల గురించి, అవి తన కుటుంబం, కీర్తిని ఎలా ప్రభావితం చేస్తాయనే దాని గురించి ఆలోచిస్తుంది.అనుపమ తెలివైన, గౌరవప్రదమైన నిర్ణయాలు తీసుకుంటుంది.
అందుకే నేటితరం హీరోయిన్ల కంటే అనుపమ పరమేశ్వరన్‌ని జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.మొత్తంగా చూసుకుంటే భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఆమె అరుదైన ఆణిముత్యం.