మన దేశంలోని ప్రజలను గజగజా వణికించిన వైరస్ లలో కరోనా వైరస్( Corona Virus ) కూడా ఒకటి.కరోనా బారిన పడిన వాళ్లలో చాలామందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తుండటం గమనార్హం.
కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో రెండు సంవత్సరాల పాటు విపరీతమైన ఒంటినొప్పులు, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయని సమాచారం అందుతోంది.లాన్సెట్ రీజనల్ హెల్త్ యూరప్ జర్నల్( The Lancet Regional Health – Europe ) లో ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని ప్రచురించారు.
లియో, వయో బేధాలతో సంబంధం లేకుండా అందరిలో ఇది సమానంగా కనిపించిందని ఆన్సెట్ రీజనల్ హెల్త్ యూరప్ జర్నల్ వెల్లడించడం గమనార్హం.
కరోనాతో రెండు నెలలు, అంతకు మించి ఆస్పత్రులలో ఉన్నవాళ్లలో ఎక్కువమంది ఈ సమస్యలతో బాధ పడ్డారని తెలుస్తోంది.64880 మంది వయోజనులను ఎంచుకుని ఈ సర్వేను నిర్వహించడం జరిగింది.2020 ఏప్రిల్ నుంచి 2022 ఆగష్టు మధ్య వేర్వేరు కరోనా సమస్యలతో బాధ పడిన వాళ్లను ఈ అధ్యయనం కోసం తీసుకోవడం జరిగింది.వీళ్లంతా పూర్తిస్థాయిలో లేదా పాక్షికంగా కరోనా వ్యాక్సిన్లు( Covid Vaccine ) వేయించుకున్న వాళ్లు కావడం గమనార్హం.వీళ్లలో 22000 కంటే ఎక్కువ మంది కరోనా సమయంలో ఆ వ్యాధితో బాధపడ్డారు.
ఇలా మంచాన పడ్డవాళ్లలో ఇతరులతో పోలిస్తే 37 శాతం ఎక్కువగా కరోనా లక్షణాలు( Corona Symptoms ) వేధించాయి.
శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తల తిప్పడం, తలనొప్పి ఇతర సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.మంచాన పడ్డ వాళ్లతో పోల్చి చూస్తే ఇతరుల్లో కూడా సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తీవ్రస్థాయిలో లేవు.కరోనా వచ్చిన మూడు నెలల తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తే మాత్రం దానిని లాంగ్ కోవిడ్( Long Covid ) అని చెబుతారు.
లాంగ్ కోవిడ్ ప్రజారోగ్యానికి పెద్ద సమస్యగా మారిందని అంతర్జాతీయంగా ఎంతోమంది దీని బారిన పడ్డారని ఎమిలీ జోయ్స్ అనే డాక్టోరల్ స్టూడెంట్ వెల్లడించడం గమనార్హం.