ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి.ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే నవంబర్ ఒకటవ తేదీ వరుణ్ తేజ్( Varun Tej ) నటించిన లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడి వివాహం కూడా మురళీమోహన్ మనవరాలితో జరగబోతుందని తెలుస్తుంది.
వెంకటేష్ తన రెండవ కుమార్తెకు కూడా ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల ఇళ్లల్లో పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అయితే త్వరలోనే మరో ఇంటిలో కూడా పెళ్లి బాజాలు మోగబోతున్నాయని తెలుస్తుంది.
సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దిల్ రాజు ( Dil Raju ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈయన తండ్రిగారు మరణించిన విషయం మనకు తెలిసిందే.అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలి అంటారు.దీంతో దిల్ రాజు సోదరుడు కుమారుడైన హీరో ఆశిష్ రెడ్డి ( Ashish Reddy ) వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావించారట.
దీంతో త్వరలోనే ఆశిష్ రెడ్డి కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది.ఆశిష్ రౌడీ బాయ్స్ ( Rowdy Boys ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే పెద్దగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
దిల్ రాజు తండ్రి గారు బ్రతికి ఉన్నప్పుడే ఆశిష్ కి పెళ్లి చేయాలని భావించారట.ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబంతో దిల్ రాజు కుటుంబ సభ్యులు వియ్యం అందుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఆశిష్ పెళ్లి పూర్తిగా పెద్దలు నిశ్చయించిన వివాహమేనని తెలుస్తుంది.ఇలా దిల్ రాజు ఇంట్లో కూడా త్వరలోనే పెళ్లి భాజలు మోగనున్నాయి.ఈ విషయం గురించి దిల్ రాజు కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా అధికారకంగా ప్రకటించలేదు.ఈ ఏడాది చివరిలో వీరిద్దరి నిశ్చితార్థం ఉంటుందని, వచ్చే ఏడాదిలో వివాహం జరగబోతుందని తెలుస్తోంది.
అయితే ఈ లోగా ఈ విషయం గురించి దిల్ రాజు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.