నేడు కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితా 

తెలంగాణలో కాంగ్రెస్( Congress ) జోరు మీద ఉంది ఇతర పార్టీలలోని నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతుండడంతో , రెండో విడత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వాయిదా వేస్తూ వచ్చారు.అయితే బీఆర్ఎస్,   బిజెపిలోని కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరే విషయంలో క్లారిటీ రావడంతో రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

 Today Is The List Of Candidates For The Second Phase Of Congress, Telangana Cong-TeluguStop.com

  గెలుపు గుర్రాల టికెట్లు ఇచ్చే విషయంపై ఈరోజు స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుంది .ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మలి జాబితా దాదాపుగా సిద్ధమైంది.  నేతల చేరికలతో మార్పు చేర్పులు చేపట్టారు .నిన్న రాత్రి కి పూర్తిస్థాయిలో జాబితాను కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారట.  ఈ జాబితాలో 34 మంది అభ్యర్థుల తో పాటు,  కమ్యూనిస్టులకు కేటాయించబోయే సీట్ల పైన క్లారిటీకి వచ్చింది.

Telugu Congress, Muralidaran, Revanth Reddy, Telangana-Politics

కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న స్థానాలకు అభ్యర్థులను కేటాయించేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది.అలాగే పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించే నిమిత్తం  కొద్ది రోజులుగా ఢిల్లీలో మురళీధరన్ ( Muralidharan )నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు .తొలివిడత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో 55 మంది పేర్లను ప్రకటించారు.ఆయా స్థానాల్లో టికెట్ లపై ఆశలు పెట్టుకున్న వారు తీవ్ర అసంతృప్తి గురవడం తో  రెండో విడత జాబితాలో అసంతృప్తులు లేకుండా చూసుకునేందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు.

Telugu Congress, Muralidaran, Revanth Reddy, Telangana-Politics

ఇద్దరు ముగ్గురు నేతలు ఒకే నియోజకవర్గానికి సంబంధించి నేతలను ఢిల్లీకి ( Delhi )పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు.గెలుపు అవకాశాలు లేని వారికి పరిస్థితిని వివరించి సర్వే నివేదికలు వారి ముందు ఉంచుతున్నారట .ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అవుతుంది.ఈ సమావేశంలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube