నేడు కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితా 

తెలంగాణలో కాంగ్రెస్( Congress ) జోరు మీద ఉంది ఇతర పార్టీలలోని నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతుండడంతో , రెండో విడత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వాయిదా వేస్తూ వచ్చారు.

అయితే బీఆర్ఎస్,   బిజెపిలోని కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరే విషయంలో క్లారిటీ రావడంతో రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

  గెలుపు గుర్రాల టికెట్లు ఇచ్చే విషయంపై ఈరోజు స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుంది .

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మలి జాబితా దాదాపుగా సిద్ధమైంది.  నేతల చేరికలతో మార్పు చేర్పులు చేపట్టారు .

నిన్న రాత్రి కి పూర్తిస్థాయిలో జాబితాను కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారట.

  ఈ జాబితాలో 34 మంది అభ్యర్థుల తో పాటు,  కమ్యూనిస్టులకు కేటాయించబోయే సీట్ల పైన క్లారిటీకి వచ్చింది.

"""/" / కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న స్థానాలకు అభ్యర్థులను కేటాయించేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది.

అలాగే పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించే నిమిత్తం  కొద్ది రోజులుగా ఢిల్లీలో మురళీధరన్ ( Muralidharan )నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు .

తొలివిడత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో 55 మంది పేర్లను ప్రకటించారు.ఆయా స్థానాల్లో టికెట్ లపై ఆశలు పెట్టుకున్న వారు తీవ్ర అసంతృప్తి గురవడం తో  రెండో విడత జాబితాలో అసంతృప్తులు లేకుండా చూసుకునేందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు.

"""/" / ఇద్దరు ముగ్గురు నేతలు ఒకే నియోజకవర్గానికి సంబంధించి నేతలను ఢిల్లీకి ( Delhi )పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు.

గెలుపు అవకాశాలు లేని వారికి పరిస్థితిని వివరించి సర్వే నివేదికలు వారి ముందు ఉంచుతున్నారట .

ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అవుతుంది.ఈ సమావేశంలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

అభిమాని పిలుపు విని షాకైన స్టార్ హీరో ప్రభాస్.. డార్లింగ్ కు భారీ షాకిచ్చాడుగా!