టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులోని వెకేషన్ బెంచ్ విచారణ జరిగింది.ఇందులో భాగంగా న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అన్నారు.
వ్యక్తిగత కారణాల వలన విచారణ చేపట్టలేనని న్యాయమూర్తి తెలిపారు.ఈ క్రమంలో పిటిషన్ ను ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారని జడ్జి వెల్లడించారు.
అయితే ఈ పిటిషన్లపై సోమవారం కానీ మంగళవారం కానీ విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.







