రెండ్రోజుల్లో భారతదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఓ ఎన్ఆర్ఐ.తన స్వదేశాన్ని , స్వగ్రామాన్ని చివరిసారిగా చూసుకోకుండానే ఓ ఉన్మాది చేతిలో బలయ్యాడు.
అక్టోబర్ 19న అమెరికాలోని న్యూయార్క్‌లో( Newyork ) జరిగిన చిన్న కారు ప్రమాదం తర్వాత అగంతకుడు చేసిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని జస్మర్ సింగ్ (66)గా( Jasmer Singh ) గుర్తించారు.
ఒకవేళ ప్రాణాలతో వుండి వుంటే గనుక ఆయన ఇప్పుడు పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని తాండా సమీపంలోని తన స్వగ్రామమైన జహురాలో( Jahura ) వుండేవారు.
ఆయన అక్టోబర్ 24న జహురాకు రావాల్సి వుంది.
జస్మర్ సింగ్ మూడు దశాబ్ధాల క్రితం అమెరికాకు వలసవెళ్లారు.ఆ వెంటనే తన కుటుంబాన్ని కూడా ఆయన యూఎస్‌కు( USA ) తీసుకెళ్లారు.
జస్మర్ మరణవార్త తెలుసుకున్న గ్రామంలోని బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.జహురాకు చెందిన పుష్పిందర్( Pushpinder ) అనే వ్యక్తి జస్మర్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆయన ప్రతి ఏడాది గ్రామానికి వచ్చి.ఒక నెల పాటు ఇక్కడే వుండేవారని, గ్రామస్తులతో సరదాగా గడిపేవారని తెలిపారు.
జస్మర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఎస్ఎస్ ముల్తానీ, సుఖ్‌రాజ్ సింగ్, కుమార్తె కన్వల్‌జిత్ కౌర్ వున్నారని పుష్పిందర్ తెలిపారు.వీరంతా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించారని .జస్మర్ మరణవార్త తెలియగానే ముల్తానీతో మాట్లాడానని చెప్పాడు.
కాగా.జస్మర్ హత్యకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు అక్టోబర్ 20న నిందితుడు గిల్బర్ట్ అగస్టిన్‌ను( Gilbert Augustin ) అరెస్ట్ చేశారు.ఇతనిపై నరహత్య, దాడి అభియోగాలు మోపినట్లు డైలీ న్యూస్ నివేదించింది.
అక్టోబర్ 19న క్యూ గార్డెన్స్‌లోని హిల్‌సైడ్ అవెన్యూ సమీపంలో వాన్ విక్ ఎక్స్‌ప్రెస్ వేపై( Van Wyck Expressway ) సింగ్.అగస్టిన్ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.
రెండు కార్లపై గీతలు వున్నట్లుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై సింగ్ 911కి కాల్ చేస్తుండగా .అగస్టిన్ అతని చేతిలోని ఫోన్ లాక్కున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.ఈ వాగ్వాదం ముగిశాక.
సింగ్ తన ఫోన్‌ను తీసుకునేందుకు గాను అతనిని అనుసరించాడు.
ఎట్టకేలకు తన ఫోన్ సంపాదించి తన కారు దగ్గరికి వెళ్తున్న సింగ్‌ను అగస్టిన్ వెనుక నుంచి తల, ముఖంపై పదే పదే కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.దీంతో సింగ్ నేలపై కూలిపోయాడు.అయినప్పటికీ అగస్టిన్ అతనిని వదిలిపెట్టకుండా కొడుతూనే వున్నాడు.
కొద్దిసేపటికి తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి రెండు మైళ్ల దూరంలోనే అగస్టిన్‌ను అరెస్ట్ చేశారు.
అతని వద్ద సస్పెండ్ చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్ వుందని, అలాగే అతని అలబామా లైసెన్స్ ప్లేట్, న్యూయార్క్ రిజిస్ట్రేషన్‌తో సరిపోలలేదని పోలీసులు గుర్తించారు.