మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్( Varun Tej ) మరియి లావణ్య త్రిపాఠి ) Lavanya tripathi )వివాహ మహోత్సవం నవంబర్ 1 వ తారీఖున స్పెయిన్ లో కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రుల సమక్షం లో ఘనంగా జరగబోతుంది.ఈ వివాహ మహోత్సవం కి సంబంధించి లైవ్ టెలికాస్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ, టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవ్వరికీ కూడా ఆహ్వానం అందలేదని మాత్రం తెలుస్తుంది.
కేవలం మెగా ఫ్యామిలీ కుటుంబీకులు మరియు లావణ్య త్రిపాఠి కుటుంబీకులు మాత్రమే ఈ వివాహం లో పాల్గొనబోతున్నారు.రెండు నెలల క్రితం నాగబాబు నివాసం లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కి నిశ్చితార్థం జరిగింది.
సుమారుగా 5 ఏళ్ళ నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ చేస్తున్న ఈ జంట కి ఎలాంటి అడ్డు చెప్పకుండా పెద్దలు ఒప్పుకోవడం జరిగింది.చాలా కాలం నుండి లావణ్య త్రిపాఠి నాగబాబు ( Naga Babu )ఇంట్లోనే వరుణ్ తో కలిసి ఉంటుంది.
రీసెంట్ గానే నాగబాబు( Naga Babu ) ఇంట్లో వినాయక చవితి పూజలు చేస్తూ లావణ్య త్రిపాఠి కనిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఆ ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి.అయితే వరుణ్ తేజ్ పెళ్లి జరగగానే వరుణ్ తేజ్ నాగబాబు ఇంటిని వదిలి ప్రత్యేకంగా వేరే ఇంట్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.జూబ్లీ హిల్స్ ప్రాంతం లో వరుణ్ తేజ్ రీసెంట్ గానే ఒక అందమైన ఇల్లు ని కొనుగోలు చేసాడట.
తన భార్య లావణ్య తో కలిసి ప్రైవేట్ జీవితాన్ని గడపడానికి వరుణ్ తేజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.మొదటి నుండి వరుణ్ తేజ్ ప్రైవేట్ జీవితాన్ని కోరుకునే వ్యక్తి.
పెళ్లి కూడా ప్రైవేట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే స్పెయిన్ లో ఏర్పాటు చేయించుకున్నాడు.రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వరుణ్ తేజ్ ఈ విషయాన్నీ స్వయంగా తెలియచేసాడు.
కనీసం వెడ్డింగ్ రిసెప్షన్ అయినా హైదరాబాద్ లో చేసుకుంటాడో లేదో చూడాలి.వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి( Varun Tej Lavanya tripathi ) కలిసి ఇప్పటి వరకు మిస్టర్ ( Mister )మరియు అంతరిక్షం వంటి సినిమాల్లో నటించారు.ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యాయి.కానీ వీళ్ళ ప్రేమాయణం మాత్రం అంతరిక్షం సినిమా సమయం లోనే మొదలైనట్టు వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
ఇక నవంబర్ 1 వ తారీఖున జరగబోయే ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన అధికారిక వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.