వైరల్: మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన ఆడవాళ్ళు పాపం ఎలా తడబడ్డారో చూడండి!

కాలంతోపాటు నగరాల జీవన విధానం ఏవిధంగా మారిపోతుందో అందరికీ తెలిసిందే.అదేవిధంగా నిత్యం పల్లెలతో మమేకమై ఇప్పటికీ బయటి ప్రపంచం తెలీని ఎంతోమంది సందర్భానుసారం నగరానికి వచ్చి నానా అగచాట్లు పడుతూ వుంటారు.

 Women From Rural Areas Climb Escalator For The First Time Funny Viral Video Deta-TeluguStop.com

ఇలాంటి సమయాల్లో ఏదో వింత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు ఫీలవుతూ ఉంటారు.ఇక చదువురాని వారి పరిస్థితి గురించి చెప్పాల్సిన పని లేదు.

ఈ క్రమంలోనే తాజాగా, ఇద్దరు మహిళలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.ఇక్కడ ఇద్దరు మహిళలు మొదటిసారి ఎస్కలేటర్( Escalator ) ఎక్కారు.

అయితే మధ్యలోకి వెళ్లగానే ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.దాంతో సోషల్ మీడియాలో ఆ ఇద్దరు మహిళలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, ఇద్దరు పల్లెటూరి మహిళలు( Rural Women ) అవసరానికి నగరానికి వెళ్లారు.ఈ క్రమంలో రైల్వే స్టేషన్( Railway Station ) ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఎస్కలేటర్ ఎక్కాల్సి వచ్చింది.ఎస్కలేటర్‌ ఎక్కడం తెలీకపోవడంతో.చాలా సేపు ఆలోచించారు.అక్కడున్నవారు కూడా వారికి సలహాలు ఇవ్వలేదు.చివరికి ఏమైతే అదవుతుందిలే అనుకుని ధైర్యం చేసి ఎస్కలేటర్‌పై అడుగుపెట్టారు.

ఇక మెట్లు పైకి వెళ్తుండడంతో వారి భయం మరింత పెరిగిపోయింది.కాస్తంత ఎత్తుకు వెళ్లగానే బ్యాలెన్స్ చేసుకోలేక.

కిందపడ్డారు పాపం.ఆ చోద్యాన్ని చూసి పక్కన ఉన్న వారంతా చూస్తూ ఉండిపోయారే గానీ.

వారికి ఎవరూ సాయం చేయలేదు పాపం.కింద పడ్డ మహిళలు చివరకు ఎలాగోలా లేచి మెట్లపైనే కూర్చున్నారు.

అయితే వారికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది.కాగా, కొందరు కాపాడాల్సింది పోయి.ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో( Social Media ) షేర్ చేయగా దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.”పాపం! అమాయకులు వారు అలాంటివి ఎప్పుడు చుసుండరు, సాయం చేయకుండా వీడియో తీయడం చాలా దారుణం!” అని కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube