భారీ ప్లాన్ తో .. హుస్నాబాద్ కు నేడు కేసీఆర్ ! 

చాలా రోజులుగా యాక్టివ్ పాలిటిక్స్ కి కెసిఆర్( KCR ) దూరంగా ఉంటున్నారు .ఆయన బయటికి కనిపించడం లేదు.

 Kcr To Start Election Campaign Husnabad Public Meeting,brs, Telangana Government-TeluguStop.com

అన్ని వ్యవహారాలను మంత్రులు,  కేటీఆర్, హరీష్ రావు,  ఎమ్మెల్సీ కవితల చక్కబెడుతున్నారు.కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేదని , అందుకే ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, ఇప్పట్లో ఆయన యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొనే అవకాశమే లేదని పెద్ద ఎత్తున ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది.

ఇతర విమర్శలకు చెక్ పెట్టే విధంగా కేసీఆర్ కథనరంగంలోకి దూకుతున్నారు.  నేడు హుస్నాబాద్( Husnabad ) నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు.

కెసిఆర్ కు హుస్నాబాద్ సెంటిమెంట్ 2014,  18 లో అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు.ఇప్పుడు అదే ప్లాన్ తో ఉన్నారు.

Telugu Brs Mla Candis, Brs, Cm Kcr, Congress, Kcr Husnabad, Telangana-Politics

 ఈరోజు హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ( Husnabad Puublic Meeting )ను ఏర్పాటు చేశారు.దీనికి ప్రజా ఆశీర్వాద సభ అని పేరు పెట్టారు.హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి భారీగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభను ఏర్పాటు చేశారు.ఈ సభను సక్సెస్ చేసి బిఆర్ఎస్( BRS ) సత్తా చాటాలనే పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు .కెసిఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని నాలుగు విడతల్లో చేపట్టాలని నిర్ణయించారు.ఈరోజు నుంచి నవంబర్ 9 వరకు 17 రోజుల్లో 42 నియోజకవర్గాలలో పర్యటించనున్నారు.17న సిరిసిల్ల, నవంబర్ 2న ధర్మపురి , 3 న కోరుట్ల , 7న మంథని, పెద్దపల్లి సభలో పాల్గొంటారు.ఆ తర్వాత నామినేషన్ వ్యవహారాలు చూస్తారు.ఆ తరువాత మిగతా నియోజకవర్గాలపై దృష్టి సారించినన్నారు.ఒకవైపు  బీఆర్ఎస్  ప్రత్యర్థులైన కాంగ్రెస్, బిజెపిలు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అనేక వ్యూహాలు రచిస్తుండడంతో,  వాటిని ఎప్పటికప్పుడు తిప్పుకొట్టే విధంగా బి ఆర్ ఎస్ ను ముందుకు తీసుకు వెళ్లే విధంగా కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారు.

Telugu Brs Mla Candis, Brs, Cm Kcr, Congress, Kcr Husnabad, Telangana-Politics

తెలంగాణ పై కేంద్ర బిజెపి పెద్దలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం , కాంగ్రెస్( Congress ) సైతం తప్పకుండా తామే గెలుస్తామని నమ్మకంతో ఉండడం,  ఈ మేరకు ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలకు చేరువవుతుండడం , కర్ణాటకలో అమలు చేసిన పథకాలను తెలంగాణలోనూ అమలు చేస్తామనే హామీలు ఇస్తుండడం వంటివన్నీ కేసిఆర్ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.కాంగ్రెస్ , బిజెపి( BJP ) లకు ఛాన్స్ ఇవ్వకుండా అంతకంటే మెరుగైన పథకాలను ప్రకటించే ఆలోచనతో ఉన్నారు.ఇక కెసిఆర్ ఈరోజు హుస్నాబాద్ ప్రసంగంలో ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తికరంగా మారింది .కేసీఆర్ ప్రసంగం తర్వాత పార్టీని  వేడాలనుకుంటున్నా వారు,  ఇతర పార్టీలో చేరిన వారు తిరిగి వెనక్కి వస్తారని బీ ఆర్ ఎస్ అంచనా వేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube