ఇండియాలో రిచెస్ట్ పర్సన్ మళ్లీ అతనే... అతనిని కొట్టేవాడు ఇంకా లేడా?

యావత్ భారతదేశంలో( India ) మళ్ళీ అతనే అత్యంత సంపన్నుడిగా రికార్డులకెక్కాడు.అతను మరెవరో కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ( Reliance Industries Chairman Mukesh Ambani ).

 Mukesh Ambani Overtakes Gautam Adani To Emerge As The Richest Indian,richest Man-TeluguStop.com

ఈ విషయంలో ఆయన అదానీ గ్రూపు సంస్థల బాస్ గౌతమ్ అదానీని వెనక్కి నెట్టడం విశేషం.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం.అంబానీ సంపద 2014లో రూ.1,65,100 కోట్ల నుంచి ఈ ఏడాది నాటికి దాదాపు రూ.8,08,700 కోట్లకు పెరిగింది.అంటే దాదాపు 4 రెట్లు.హురున్ ఇండియా.360 వెల్త్ తో కలిసి ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ని విడుదల చేసింది.

Telugu Adani, Gautam Adani, Hurunindia, India, Mukesh Ambani, Richest-General-Te

దీని ప్రకారం. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ( Gautam Adani ) 2వ స్థానానికి పడిపోవడం కొసమెరుపు.హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు కారణంగా ఆయన సంపద చాలా తగ్గి రూ.4,74,800 కోట్లకు పడిపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.దీంతో ఆయన రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అదానీ సంస్థ స్టాక్ మానిప్యులేషన్, మనీలాండరింగ్ వంటి అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపించడంతో ఆయన కంపెనీల స్టాక్స్ విపరీతంగా నష్టపోయిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే.

Telugu Adani, Gautam Adani, Hurunindia, India, Mukesh Ambani, Richest-General-Te

ఆ తరువాత చూసుకుంటే, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి సైరస్ పూణావాలా( Cyrus S.Poonawalla ) 2023 నాటికి మొత్తం రూ.2,78,500 కోట్ల సంపదతో 3వ స్థానంలో వెలుగొందుతున్నారు.ఈయన కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేసి భారీగా సంపాదించిన సంగతి విదితమే.తరువాత హెచ్సీఎల్ టెక్ శివ్ నాడార్ రూ.2,28,900 కోట్ల సంపదతో 4వ స్థానంలో, గోపీచంద్ హిందూజా కుటుంబం రూ.1,76,500 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు.ఇక సన్ఫార్మా ఫౌండర్ దిలీప్ షాంఘ్వీ1,64,300 కోట్ల సంపదతో 6వ స్థానంలో వుండగా ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ కుటుంబం రూ.1,62,300 కోట్ల సంపాదనతో 7వ స్థానంలో, అదేవిధంగాడీమార్ట్ పేరుతో రిటెయిల్ స్టోర్లు నడిపే రాధాకిషన్ దమానీ కుటుంబం రూ.1,43,900 కోట్ల సంపదతో 8వ స్థానంలో ఉంది.కుమార మంగళం బిర్లా ఫ్యామిలీ( Kumar Mangalam Birla Family ) రూ.1,25,600 కోట్ల సంపదతో తొమ్మిదో స్థానంలో, రూ.1,20,700 కోట్ల నెట్వర్త్తో నీరజ్ బజాజ్ ఫ్యామిలీ వరుసగా పదో స్థానాల్లో ఉన్నారు.ఆసక్తికర విషయం ఏంటంటే.

భారతదేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube