అవును, సరిగ్గా వినండి.లేదంటే పెను ప్రమాదాలు ముంచుకొస్తాయి.
ఆండ్రాయిడ్ 13,( Android 13 ) అంతకన్నా ఓల్డ్ వెర్షన్లతో మీ ఫోన్స్ రన్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి.చాలా డేంజర్! ఎందుకంటే ఆ ఫోన్లకు మెరుగైన సెక్యూరిటీ అప్‌డేట్స్ ను కంపెనీలు అందించలేవు.
అలాంటప్పుడు అవి హ్యాకర్లకు ఈజీ టార్గెట్ అవుతుంటాయి అని మర్చిపోవద్దు.అవును, ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు, ప్రత్యేకంగా 13, అంతకంటే పాత వెర్షన్లను ఉపయోగిస్తున్న వారికి హ్యాకింగ్( Hacking ) బారిన పడే రిస్క్ పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రభుత్వ సంస్థ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) ఆండ్రాయిడ్ 13, అంతకన్నా ఓల్డ్ వెర్షన్లు వాడే వారందరికీ తాజాగా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
అవును, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో చాలా ప్రమాదకరమైన సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని CERT-In కనుగొంది.ఈ ప్రాబ్లమ్స్‌ను హ్యాకర్లు సద్వినియోగం చేసుకుంటూ ఆండ్రాయిడ్ డివైజ్‌ను( Android Devices ) కంట్రోల్లోకి తీసుకొని డేటాను తస్కరించవచ్చు లేదా ఉపయోగించలేని విధంగా కూడా మార్చవచ్చు.అంతేకాకుండా వారివారి అసాంఘిక కార్యకలాపాలకు కూడా మిమ్మల్ని ఓ పావులా వాడుకోవచ్చు.
ఈ సెక్యూరిటీ ప్లాస్ అనేవి ఫోన్ సెక్యూరిటీ సిస్టమ్‌లో హోల్స్ లాగా పనిచేస్తాయి.వీటి ద్వారా హ్యాకర్లు ఫోన్లలోకి హానికరమైన కోడ్స్ ప్రవేశపెట్టే ప్రమాదం ఉంది.
ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పాత వెర్షన్‌లను ప్రభావితం చేస్తాయని, ప్రత్యేకంగా అండ్రాయిడ్ 11, 12, 12L, 13 వెర్షన్లను ప్రమాదంలో పడేస్తాయని CERT మొత్తుకొని మరీ చెబుతోంది.ఈ సమస్యలు కేవలం ఆండ్రాయిడ్‌లోని ఒక భాగంలోని మాత్రమే కాదని, అనేక విభిన్న భాగాలలో ఉన్నాయని ప్రభుత్వ సంస్థ తెలిపింది.అంతేకాకుద్న ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లోని ముఖ్యమైన భాగాలు, మీడియాటెక్, యునిసోక్, ఆర్మ్, క్వాల్‌కామ్ వంటి వివిధ హార్డ్‌వేర్ భాగాలు, ఓపెన్ సోర్స్ కాని క్వాల్‌కామ్ భాగాల్లో కూడా సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.కాబట్టి మిత్రులారా జాగ్రత్త పడండి!