తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి ప్రియమణి ( Priyamani ) ఒకరు.ఈమె తెలుగులో నాగార్జున వెంకటేష్ ఎన్టీఆర్ వంటి హీరోలందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ విధంగా ప్రియమణి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటించి సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె వివాహం చేసుకున్న అనంతరం పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ప్రియమణి అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర మాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షోలకు జడ్జిగా ఈమె హాజరవుతూ సందడి చేశారు.ఇలా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ప్రియమణి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమై తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు.అయితే ఈసారి ఈమె స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా ఒక వైపు సినిమాలలోను మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రియమణి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ప్రియమణి హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈమె తరుణ్, జగపతిబాబు వంటి హీరోలతో రిలేషన్ లో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలన్నీ కేవలం ఆ వాస్తవమేనని తెలిసిపోయింది .అయితే తాజాగా ప్రియమణి గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒక స్టార్ హీరో తన కోరిక తీరుస్తాను అంటూ మాట ఇచ్చారట దీంతో ఆ హీరో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అని ప్రియమణి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.
మరి ఈమెకు ఏ హీరో ఏ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చారు అనే విషయానికి వస్తే…ప్రియమణి ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2 సినిమాలో కూడా కీలకపాత్రలో నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలు పై గతంలో స్పందించిన ప్రియమణి ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు అయితే తాజాగా జవాన్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి ఈ విషయం గురించి ప్రస్తావనకు రాగా పలు విషయాలను తెలియజేశారు.
పుష్ప 2 ( Pushpa 2 )సినిమాలో తాను నటించలేదని తెలియజేశారు.అయితే అల్లు అర్జున్ గారితో నటించాలని తాను ఎప్పటి నుంచి కోరుకుంటున్నానని అయితే ఇప్పటివరకు తనకు అవకాశం రాలేదని తెలిపారు.కానీ అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఆ ఆకాశాన్ని తాను ఎట్టి పరిస్థితులలోను వదులుకోనని ఈమె తెలియజేశారు.
అయితే ఒక సందర్భంలో అల్లు అర్జున్ తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తనకు అల్లు అర్జున్( Allu Arjun ) ఒక మాట ఇచ్చారట నా సినిమాలో నటించాలని కోరిక త్వరలోనే తీరుతుంది అంటూ మాట ఇచ్చారని తెలుస్తోంది.అల్లు అర్జున్ మాట ఇచ్చారు అంటే తప్పకుండా తన సినిమాలలో అవకాశం కల్పిస్తారనే ఆశతో ప్రియమణి కూడా ఎదురు చూస్తున్నారట మరి అల్లు అర్జున్ తన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారు ఈమె కోరిక ఎప్పుడు తీరుస్తారో తెలియాల్సి ఉంది.