క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్..!

భారత్ వేదికగా ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి తొమ్మిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది.న్యూజిలాండ్ జట్టు బ్యాటర్లైన డెవాన్ కాన్వే( Devon Conway ), రచిన్ రవీంద్ర అద్భుతమైన సెంచరీలతో చెలరేగి న్యూజిలాండ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు.

 New Zealand Created A New History In The History Of Cricket..england Was Defeate-TeluguStop.com
Telugu Cricket Cup, Devon Conway, England Ireland, England Zealand, Rachin Ravin

వన్డే క్రికెట్ ఫార్మాట్ లో ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఓ అద్భుతమైన సరికొత్త రికార్డును న్యూజిలాండ్ జట్టు సాధించింది.ప్రపంచ కప్ లో 40 ఓవర్ల లోపు 280 ప్లస్ పరుగుల భారీ స్కోరును చేజించిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.న్యూజిలాండ్ జట్టు 36.2 ఓవర్లలోనే 283 పరుగులు చేసింది.న్యూజిలాండ్ బ్యాటర్ అయిన డెవాన్ కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్ లతో 152 పరుగులు చేశాడు.రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్ లతో 123 పరుగులు చేశాడు.

వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున రచిన్ రవీంద్ర ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.అంతేకాదు ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ చేసిన అతిపిన్న వయస్సు ఉన్న బ్యాట్స్మెన్ గా నిలిచాడు.23 ఏళ్ల 321 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.అంతేకాదు ప్రపంచ కప్ లో ఆరంగేట్రం చేసి సెంచరీ సాధించిన ఐదవ న్యూజిలాండ్ ఆటగాడిగా రచిన్ రవీంద్ర నిలిచాడు.

Telugu Cricket Cup, Devon Conway, England Ireland, England Zealand, Rachin Ravin

ప్రపంచ కప్ లో అతి భారీ లక్ష్యాన్ని చేదించిన జట్ల విషయానికి వస్తే.2011 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్- ఐర్లాండ్ ( England vs Ireland )మధ్య జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 328 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించింది.2019 ప్రపంచ కప్ లో వెస్టిండీస్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 41.3 ఓవర్లలో 32 పరుగుల లక్ష్యాన్ని చేదించింది.ఇక ఇంగ్లాండ్ జట్టును పసికూనను చేసి న్యూజిలాండ్ చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది.

ఇంగ్లాండ్ ఇంత చిత్తుగా ఓడిపోవడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube