సీఎం పదవి పై ముదినేపల్లి సభలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గ ముదినేపల్లిలో నిర్వహించిన వారాహి యాత్రలో సీఎం పదవిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండటానికి తాను అనేకసార్లు వెనకడుగు వేయాల్సి వచ్చిందని అదే సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు.జగన్ నీ ఇంటికి  పంపించే సమయం వచ్చేసిందని.

జగన్ కు టాటా చెప్పేద్దామని పిలుపునిచ్చారు.ఇక ఇదే సమయంలో సీఎం పదవి వస్తే బలంగా పనిచేస్తానని లేకపోతే బాధ్యతగా పనిచేస్తానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉంది.పాఠశాలలో మూతపడుతున్నాయి వలసలు పెరిగిపోతున్నాయి.ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం నిలబడతానని చెప్పుకొచ్చారు.ప్రాణం పోయేంతవరకు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ పథకాలకు తాను వ్యతిరేకం కాదని ఇంకో పది వేలు ఎక్కువ ఇవ్వాలని అందరికి ఉద్యోగాలు కల్పించాలని పవన్ పేర్కొన్నారు.సంక్షేమ పథకాల రూపంలో జగన్ ఇచ్చే డబ్బు ప్రజలదే అని చెప్పుకొచ్చారు.

ప్రత్యేకంగా జగన్ తన జోబులో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube