టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కావడంతో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు.ఇలా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండానే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఆయనని అరెస్టు చేశారు అంటూ నారా కుటుంబ సభ్యులు అధికార ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలియజేస్తున్నారు.అయితే చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ నారా లోకేష్( Lokesh ) బ్రాహ్మణి ( Brahmini ) మోత మోగిద్దాం అనే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయనకు మద్దతుగా సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7:05 నిమిషాల వరకు ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటిగా ఇంట్లోనా లేదా ఆఫీసులోనూ విరామం లేకుండా ఐదు నిమిషాల పాటు గంట మోగించాలని పిలుపునిచ్చారు.ఇందుకు సంబంధించిన పోస్టర్ ను బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది.అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలుసు ఆయన అరెస్ట్ అక్రమం అందుకే ఆయనకు మద్దతుగా మోత మోగిద్దాం అనే కార్యక్రమానికి మద్దతు తెలపాలని ఈమె తెలియజేశారు.
ఇలా ఈ కార్యక్రమానికి లోకేష్ బ్రాహ్మణి శ్రీకారం చుట్టడంతో సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ( Ramgopal Varma ) బ్రాహ్మణికి సలహా ఇచ్చారు…బ్రాహ్మణి మీరు ఒక వర్ధమాన రాజకీయవేత్త.మీకు నేను ఓ సలహా ఇస్తున్నాను.మీరు ప్రజలపై ఎంత ప్రభావం చూపగలరు అని తెలుసుకోవడం కోసం టెస్ట్ చేయడం కోసం ఇలాంటి ప్రమాదకరమైన ప్రతిపాదనలు చేయకండి.మీ ప్రతిపాదనను ఎవరు పాటించకపోతే మీ రాజకీయ భవిష్యత్తు షార్ట్ సర్క్యూట్ లాగా పేలిపోతుంది.
విద్యుత్ శక్తి అనేది ఎప్పుడు మెరుస్తూనే ఉండాలి అంటూ ఈ సందర్భంగా ఈయన నారా బ్రాహ్మణికి( Brahmini ) సలహా ఇస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.