కెనడియన్ ఆర్మీ వెబ్‌సైట్‌పై ఇండియన్ హ్యాకర్లు దాడి.. వణికిస్తున్నారు కదా...!

కెనడియన్ సాయుధ దళాల వెబ్‌సైట్‌ను భారతీయులమని చెప్పుకునే హ్యాకర్ల బృందం తాజాగా హ్యాక్ చేసింది.ఈ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా తొలగించిన తర్వాత భారతదేశం, కెనడా మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.“ఇండియన్ సైబర్ ఫోర్స్”( Indian Cyber ​​Force ) అని పిలిచే హ్యాకర్ల గ్రూప్ ఇటీవల డిసేబుల్ చేసిన వెబ్‌సైట్‌ స్క్రీన్‌షాట్‌ను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసింది.ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ ( Hardeep Singh Nijjar )మృతికి సంబంధించి కెనడా ప్రభుత్వం భారత్‌పై చేస్తున్న ఆరోపణలను హ్యాకర్లు నిరసిస్తూ ఇలా చేసి ఉండొచ్చు.

 Canadian Army Website Attacked By Indian Hackers, India, Canada, Website Hack, C-TeluguStop.com

సెప్టెంబర్ 21న, హ్యాకర్ల బృందం కెనడియన్ సైబర్‌స్పేస్‌పై( Canadian Cyberspace ) దాడి చేస్తామని బెదిరించింది.మరుసటి రోజు, జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) ఆరోపణలు, భారత వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.హ్యాకర్లు మధ్యాహ్నం సమయంలో వెబ్‌సైట్‌పై అటాక్ చేశారు.కెనడియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వెబ్‌సైట్‌పై దాడి కారణంగా కొద్ది గంటల పాటు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో కొందరు వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఈ అటాక్‌ను త్వరగా కెనడా ప్రభుత్వం తిప్పికొట్టింది.తమ వ్యవస్థలకు ఎలాంటి పెద్ద చిక్కులు లేవని తెలిపింది.

హ్యాక్ చేయబడిన వెబ్‌సైట్ కెనడియన్ ప్రభుత్వ పబ్లిక్ వెబ్‌సైట్‌లు లేదా అంతర్గత నెట్‌వర్క్‌లలో భాగం కాదు.నావికాదళం, ప్రత్యేక కమాండ్ గ్రూపులు, వైమానిక, అంతరిక్ష కార్యకలాపాలతో కూడిన కెనడియన్ దళాలు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాయి.అయితే హ్యాకింగ్ ఘటనపై కొంతమంది వ్యాఖ్యానిస్తూ, ఇది అనవసరమని, ముఖ్యంగా ఇరు దేశాలు తమ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ ఇలాంటివి చేయకూడదని అన్నారు.వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసింది వాస్తవానికి రష్యన్‌లు అని మరికొందరు పేర్కొన్నారు.

కెనడా ప్రభుత్వాన్ని వణికిస్తున్నారు కదా అంటూ ఈ హ్యాకర్లను మరికొందరు పొగిడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube