భారతీయ రోడ్లపై అత్యంత జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే వేగంగా వెళుతున్న సమయంలో ఆవులు, బర్రెలు లేదా కుక్కలు అడ్డు రావచ్చు.
ఇలాంటి సందర్భాల్లో వాహనాన్ని వేగంగా డ్రైవ్ చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడం దాదాపు అసాధ్యంగా మారుతుంది.ఇది ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది.
జాతీయ రహదారులు గ్రామాల గుండా వెళ్తుంటాయి.ఇలాంటి రహదారులపై పశువులు అడ్డొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
అయితే కారు డ్రైవర్స్ నేషనల్ హైవే కనిపిస్తే చాలు యాక్సిలరేటర్ మొత్తం కిందకు నొక్కేస్తుంటారు.ఇది మహా డేంజర్.
ఇలాంటి స్పీడ్ డ్రైవింగ్( Speed driving ) ఎంత డేంజరో కళ్లకు కట్టినట్టు చూపించే ఒక వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది.
ఆ వీడియో ప్రకారం, టాటా ఆల్ట్రోజ్ ( Tata Altroz ) కారు అతివేగంతో ఒక రోడ్డుపై దూసుకెళ్తోంది.ఇంతలోనే ఆ కారుకు అడ్డంగా ఒక కుక్క వచ్చింది.దీంతో డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ నొక్కాడు.
ఈ కారు వెనకే టాటా హెక్సా కారు కూడా అతివేగంతో వస్తూ టాటా ఆల్ట్రోజ్‌ను చాలా బలంగా ఢీకొట్టింది.ఎంత బలంగా అంటే టాటా ఆల్ట్రోజ్ కారు వెనుక భాగం పూర్తిగా నాశనం అయ్యింది.
టాటా ఆల్ట్రోజ్ కారు యజమాని ఈ యాక్సిడెంట్ గురించి వివరించారు.2023, మార్చిలోనే దానిని కొనుగోలు చేశానని కానీ ఇంతలోనే యాక్సిడెంట్( Accident ) జరిగిందని వాపోయాడు.ప్రమాదం జరిగిన సమయంలో కారును గంటకు 90 కి.మీ వేగంతో డ్రైవ్ చేస్తున్నానని, హఠాత్తుగా కుక్క అడ్డుగా రావడంతో సడెన్‌గా బ్రేక్ వేశానని చెప్పాడు.దురదృష్టం కొద్దీ వెనుక ఉన్న కారు డ్రైవరు సరైన సమయంలో బ్రేక్ వేయలేకపోయాడని, దాంతో యాక్సిడెంట్ జరిగిందని వివరించాడు.కారు వెనుక భాగంలో ఎవరూ లేరని, అందువల్ల ప్రాణాపాయం తప్పిందని చెప్పాడు.
ముందు భాగంలో ఉన్న తనకు ఒక్క గాయం కూడా కాలేదని వెల్లడించాడు.ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కారులో ఉన్న తనకు పెద్దగా గాయాలు కాలేదు కాబట్టి కారు సేఫ్టీ పరంగా చాలా మంచిగా ఉందని అతను పేర్కొన్నాడు.
ఈ కారు రిపేరు చేయలేనంత ఘోరంగా డ్యామేజ్ కావడంతో మళ్లీ కొత్త ఆల్ట్రోజ్ రోజు కారు కొనుగోలు చేశానని చెప్పాడు.బీమా పాలసీ ఉండటం వల్ల తన నష్టం కొంతవరకు కవర్ అయిందని చెప్పుకొచ్చాడు.