తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దైంది.ఈ మేరకు గ్రూప్ -1 పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
జూన్ 11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా బయోమెట్రిక్ తీసుకుని నిబంధనలు పాటిస్తూ పరీక్షను నిర్వహించాలని తెలిపింది.అయితే పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, ఎగ్జామ్ కు హాజరైన అభ్యర్థుల నుంచి ముందు చెప్పిన విధంగా బయోమెట్రిక్ ను తీసుకోలేదని పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.