కుటుంబ సభ్యుల ముందే మహిళలపై గ్యాంగ్ రేప్..!

గతంలో ఒంటరిగా కనిపించే మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారు.కానీ ఈమధ్య కాలంలో కుటుంబ సభ్యుల ముందే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

 Thieves Gang Rape On Women In Haryana Panipat Details, Thieves, Thieves Gang Rap-TeluguStop.com

ఇలాంటి కోవలోనే గ్రామ శివారులో ఉండే ఇంట్లోకి చొరబడిన దొంగలు( Thieves ) ఆ ఇంట్లో వ్యక్తులను భయపెట్టి బంధించడంతోపాటు ఇంట్లో ఉండే మహిళలపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి ఇంట్లో ఉండే డబ్బు ఇంకా బంగారు ఆభరణాలతో పరారైన ఘటన హర్యానాలోని( Haryana ) పానిపట్ జిల్లాలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Gang, Haryana, Madlauda, Panipat, Robbery-Latest News - Telugu

వివరాల్లోకెళితే.పానిపట్ జిల్లా లోని మాట్లాడ అనే గ్రామ శివారులో ఉండే ఒక ఇంటి లోపలికి బుధవారం రాత్రి ఒంటిగంట సమయంలో నలుగురు దుండగులు ప్రవేశించారు.తమ వద్ద ఉండే కత్తులు, తుపాకులతో కుటుంబ సభ్యులను బెదిరించి అందరిని తాళ్లతో కట్టేశారు.ఆ ఇంట్లో 24, 25, 35 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు మహిళలపై ఈ దుండగులు గ్యాంగ్ రేప్ కు( Gang Rape ) పాల్పడ్డారు.అనంతరం ఇంట్లో ఉండే రూ.13 వేల నగదు తో పాటు మహిళలు ధరించిన బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని పరారయ్యారు.భర్త, పిల్లల ఎదుట తమపై గ్యాంగ్ రేప్ జరిగిందని బాధిత మహిళలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telugu Gang, Haryana, Madlauda, Panipat, Robbery-Latest News - Telugu

నలుగురు దుండగులు దాదాపుగా మూడు గంటల పాటు తమ ఇంట్లోనే ఉన్నారని.అత్యాచారం చేసే సమయంలో అరుపులు బయటికి వినిపిస్తే తుపాకితో కాల్చి చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.దుండగులు పారిపోతూ పక్కనే ఉన్న ఇంట్లోకి చొరబడి ఆ మహిళపై కూడా దాడి చేసి రూ.5000 దోచుకున్నారు.దొంగలు దాడి చేసిన తర్వాత ఆ మహిళ చికిత్స పొందుతూ చనిపోయింది.

అయితే గతంలో నెలరోజుల క్రితం కొందరు వ్యక్తులు ఈ ఇళ్ల వద్దకు వచ్చి వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.అప్పుడు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులకు.

ఇప్పుడు దారుణానికి పాల్పడిన వ్యక్తులకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube