ఇదేంటి అట్లీ హీరోయిన్లను చంపకుండా సినిమాలు చేయలేవా... హీరోయిన్స్ చస్తేనే సినిమా హిట్టా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ అట్లీ ( Atlee ) ఒకరు.ఈయన రాజారాణి సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అట్లీ అనంతరం దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అయ్యాయి.

 Interesting News Viral About Atlee Movies , Atlee, Heroins Dead, Kollywood, Dire-TeluguStop.com

తాజాగా ఈయన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అట్లీ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాల గురించి ఒకసారి ఆలోచిస్తే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వస్తుంది.

Telugu Atlee, Heroins, Kollywood-Movie

అట్లీ దర్శకత్వంలో వహించిన సినిమాలన్నింటిలోనూ హీరోయిన్స్ చనిపోయే విధంగా ఈయన సినిమాలు తీస్తున్నారు.ఇలా అట్లు దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో హీరోయిన్స్ చనిపోతేనే ఈయన సినిమాల హిట్ అవుతాయా అనే విధంగా ఈయన సినిమాలు ఉంటాయని చెప్పాలి.ఇక ఈయన దర్శకుడిగా ఎక్కించిన మొట్టమొదటి చిత్రం రాజారాణి ఈ సినిమాలో నజ్రియా ( Nazriya ) కారు యాక్సిడెంట్ లో చనిపోతుంది.

ఈ సీన్ ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో కలిచి వేసిందని చెప్పాలి.ఈయన దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా రెండో సినిమా తెరి.ఈ సినిమాలో బుల్లెట్ తగిలి సమంత ( Samantha )చనిపోయే విధంగా చూపించారు.

Telugu Atlee, Heroins, Kollywood-Movie

మెర్సల్ సినిమాలో నిత్యా మీనన్ ( Nitya menon ) పాత్ర చనిపోయేలాగా చూపించారు.ఇక తాజాగా జవాన్ సినిమాలో కూడా దీపికా పదుకొనే( Deepika Padukone ) పాత్ర చనిపోయేలాగే చూపించారు.ఈ సినిమాలో దీపికా పదుకొనే సీనియర్ షారుఖ్ ఖాన్ కు భార్యగా కనిపించారు.

ఆమెది అతిథి పాత్ర కంటే కాస్త నిడివి ఎక్కువ ఉన్న రోల్.మరణంతో ఆ పాత్రకు ముగింపు పలికారు.

కమర్షియల్ సినిమాల్లో కథానాయికల పాత్రలకు ట్రాజెడీ ఎండింగ్ ఇవ్వడం అట్లీ స్టైల్.కథకు, ప్రేక్షకులకు మధ్య ఎమోషనల్ కనెక్ట్ కోసం హీరోయిన్లను ఆయన చంపేస్తున్నారని అందుకే ఆయన సినిమాలు కూడా ఎంతో మంచి సక్సెస్ అవుతున్నాయని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube