శాండల్‌వుడ్ హీరో ధృవ సర్జా( Dhruva Sarja ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దృవ సర్జ దివంగత హీరో చిరంజీవి సర్జా( Chiranjeevi Sarja ) సోదరుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
కాగా మొదట 2012లో విడుదలైన అద్దురి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ధృవ సర్జా ఆ తర్వాత పలు సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.కన్నడ ఇండస్ట్రీలో ధృవ సర్జాకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఇది ఇలా ఉంటే ఇటీవల శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ధృవ సర్జా తన భార్యకు సీమంత వేడుక( Baby Shower ) నిర్వహించారు.
అయితే ఈ శుభకార్యం జరిగిన విధానం కన్నడ పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీసింది.ప్రస్తుతం ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.ఇంతకీ ఆయన ఏం చేశారంటే.
కాగా ధృవ సర్జా అన్నయ్య చిరంజీవి సర్జా మరణించిన విషయం మనందరికి తెలిసిందే.అయితే ధృవ సర్జా భార్య ప్రేరణ( Prerana ) గర్భంతో ఉంది.
ఈ శుభ సమయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ( Srikrishna Janmashtami ) సందర్భంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు.అయితే ఈ వేడుకను చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో నిర్వహించడం విశేషం.
శ్రీకృష్ణ జన్మాష్టమిని చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోను ధృవ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఫామ్ హౌస్ మొత్తం రకరకాల పూలతో అలంకరించి ఈ కార్యక్రమం నిర్వహించారు.అయితే తన భార్య శ్రీమంతాన్ని అన్న సమాధి వద్ద నిర్వహించడంతో కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.ఈ వేడుకతో తన అన్నపై ఉన్న ప్రేమను ధృవ సర్జా చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ధృవ సర్జా తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువులు సైతం హాజరయ్యారు.కాగా ధృవ సర్జా 2019లో ప్రేరణను వివాహం చేసుకున్నారు.
ప్రేరణను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధృవ సర్జాకు 2022 అక్టోబర్‌లో ఆడబిడ్డకు జన్మించింది.త్వరలోనే మరో బిడ్డకు కూడా జన్మనివ్వనుంది ప్రేరణ.