పవన్ కళ్యాణ్ ను నా సొంత కొడుకులాగే ఫీల్ అయ్యాను.. నాగినీడు కామెంట్స్ వైరల్!

డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా నటించిన చిత్రం గబ్బర్ సింగ్( Gabber Singh ) ఈ సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డులను సృష్టించిందో మనకు తెలిసిందే.పవన్ కళ్యాణ్ శృతిహాసన్ ( Shruthi Hassan ) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.

 Actor Nagineedu Recall Memories With Pawan Kalyan , Harish Shankar , Pawan Kaly-TeluguStop.com

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు తల్లిదండ్రుల పాత్రలలో నటి సుహాసిని( Suhasini ) నటుడు నాగినీడు ( Nagineedu ) నటించిన సంగతి మనకు తెలిసిందే.మొదటి నుంచి కూడా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు తన తండ్రి అంటే పడని విధంగానే చూపిస్తారు.

కానీ క్లైమాక్స్ లో మాత్రం నాగినీడు పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశం అందరి హృదయాలను ఆకట్టుకుంటుంది.

Telugu Gabber Singh, Harish Shankar, Pawan Kalyan, Suhasini, Tollywood-Movie

ఇలా ఈ సన్నివేశం గురించి తాజాగా నటుడు నాగినీడు ( Nagineedu )మాట్లాడటమే కాకుండా ఈయన పవన్ కళ్యాణ్ గురించి కూడా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా నాగినీడు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ చాలా గొప్ప నటుడు.ఇలా స్టార్ హీరో అయినప్పటికీ ఈయనలో ఏ మాత్రం గర్వం ఉండదు ఒక సాధారణ వ్యక్తి లాగే సెట్ లోకి అడుగు పెడతారు.

ఇక సెట్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు.అయితే తన ముందు ఎప్పుడు ఎవరో ఒక వ్యక్తి తప్పకుండా ఉంటారని వారితోనే తను మాట్లాడుతూ ఉంటారని తెలిపారు.

Telugu Gabber Singh, Harish Shankar, Pawan Kalyan, Suhasini, Tollywood-Movie

ఇలాంటి గొప్ప నటులతో కలిసి సినిమాలలో నటించడం నిజంగా అదృష్టమని నాగినీడు( Nagineedu ) తెలిపారు.ఇక ఈ సినిమా క్లైమాక్స్ సన్ని వేషంలో నాకు పవన్ కళ్యాణ్ కు మధ్య వచ్చే సన్నివేశం సినిమాకి ఎంతో హైలెట్ గా నిలిచింది .ఈ సీన్ షూట్ చేస్తున్నప్పుడు అలాగే థియేటర్లలో ఈ సీన్ వచ్చినప్పుడు నాకు నిజంగానే పవన్ కళ్యాణ్ ఒక సొంత కొడుకు అనే భావన కలిగింది అంటూ ఈయన తెలియజేశారు.ఈ విధంగా నటుడు నాగినీడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ గబ్బర్ సింగ్ సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube