టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ( Priyamani )గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత కాలంలో సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళం సినిమాలలో కూడా నటించి మెప్పించింది.అంతేకాకుండా పలు భాషల్లో షోలకు జడ్జ్ గా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది ప్రియమణి.
ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో అడపాదడపా పాత్రల్లో నటిస్తూనే మరొకవైపు ఢీ లాంటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా( Jawan Movie )తో ప్రియమణి ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇక నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాలో కూడా నటించారు ప్రియమణి.
ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ప్రియమణి అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ వార్తలపై స్పందించింది హీరోయిన్ ప్రియమణి.
నాపై వస్తున్న ఆ వార్తలు నిన్ను చూసి నేను మొదట ఆశ్చర్యానికి గురయ్యాను.

సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నట్టుగా పుష్ప 2 సినిమా( Pushpa 2 )లో నేను నటించలేదు.సోషల్ మీడియాలో వార్తలు వస్తుండడంతో అవి చూసి వెంటనే మేనేజర్ ఫోన్ చేసినట్లు వెల్లడించారు.అయితే అవకాశం వస్తే తప్పకుండా అల్లు అర్జున్‌తో మూవీలో నటిస్తానని తెలిపారు ప్రియమణి.ఇకపోతే సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.