కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్ కేసు( Skill Development Case )లో ఏసీబీ న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది.శనివారం ఉదయం.

 Chandrababu's Wife Bhuvaneshwari Shed Tears ,bhuvaneshwari, Chandrababu Naidu, C-TeluguStop.com

కర్నూలు జిల్లా నంద్యాలలో చంద్రబాబుని అదుపులోకి తీసుకున్న సీఐడీ రోడ్డు మార్గం గుండా సాయంత్రానికి విజయవాడ సిట్ కార్యాలయనికి( Vijayawada SIT Office ) తరలించి ఆదివారం ఉదయం వరకు విచారించారు.అనంతరం ఆదివారం ఉదయం ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.

దాదాపు 8 గంటలపాటు వాదనలు విన్న న్యాయమూర్తి ఈనెల 22 వరకు రిమాండ్ విధించారు.ఈ పరిణామంతో కోర్టు ఆవరణలో చంద్రబాబు( Chandrababu naidu )ని కలిసిన సతీమణి నారా భువనేశ్వరి కన్నీరు పెట్టుకున్నారు.

కాసేపు చంద్రబాబుతో మాట్లాడటం జరిగింది.నేడు పెళ్లి రోజు( Chandrababu naidu Buvaneswari Marriage Day ) కావడంతో.

చంద్రబాబుతో భువనేశ్వరి మాట్లాడుతూ కన్నీటి పర్యాంతమయ్యారు.ఆల్రెడీ శనివారం అరెస్టు చేసిన తర్వాత విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ బ్రేకులో కూడా భువనేశ్వరి, బ్రాహ్మణి( Nara Brahmani ), లోకేష్ చంద్రబాబుని కలిశారు.

అయితే నేడు కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబు జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొనడంతో.పెళ్లిరోజు ఈ రకంగా జరగడంతో భువనేశ్వరి కన్నీళ్ళు పెటుకోవడం జరిగింది.

మరో పక్క చంద్రబాబుకి బెయిల్ వచ్చే రీతిలో…టీడీపీ కీలక నేతలు ప్రత్యామ్నాయ న్యాయపోరాటాలు వెతికే పనిలో పడ్డారు.భారీ బందోబస్తు మధ్య విజయవాడ నుండి రాజమండ్రికి చంద్రబాబుని తరలించే విధంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఇదే సమయంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube